CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ సహాయకులు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తాం : సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: రెవెన్యూ శాఖలో పని చేస్తున్న గ్రామ సహాయకుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేనియెడల అఖిలపక్ష రాజకీయ పార్టీలను ఏకం చేసి ఉద్యమం తీవ్రతరం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధికంగా నిర్వహిస్తున్న వీఆర్ఏల సమ్మెకు పార్టీ తరపున సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని ఏ ఒక్క రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించిన పరిస్థితి లేదని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కుదించి మిగతా శాఖల ఉద్యోగస్తులను సర్దుబాటు చేస్తున్నారని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తోటే ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణ జరుగుతుందని  చాలిచాలని వేతనాలు తోటే బ్రతుకు వెళ్లదీయాల్సి వస్తుందని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతా భత్యాలు కుటుంబాన్ని పోషించడానికి కూడా సరిపోవడంలేదని అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో మరియు ప్రగతి భవన్లో చేసిన ప్రకటనకు కట్టుబడి పే-స్కేల్ జీవోను విడుదల చేసి తక్షణమే అమలు పరచాలని అన్నారు. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి ఇతర రెవెన్యూ పనుల దగ్గర నుండి కరోనాకాలంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి అనునిత్యం వెన్నంటి ఉండి ప్రజలకు భరోసా కల్పించిన గ్రామ సహాయకులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.గ్రామ సహాయకులు ఆనాదిగా రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్నారని వారికి అర్హతల మేరకు ప్రమోషన్లు కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కరోనా ఇతర ఆర్థిక పరిస్థితులు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా అయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు వీఆర్ఏలు సాధన పల్లి సతీష్, సాగబోయిన బాలకృష్ణ, నరేష్, ఆనందరావు, బుచ్చి రాములు, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: