CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం:

మొగలాయి పాలకుల ఆధిపత్యంపై తిరుగుబాటు చేసిన తెలంగాణ శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతి వేడుకలు గురువారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.కరకగూడెం తహశీల్దారు కార్యాలయంలో తహశీల్దారు ఉషాశారద సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కరకగూడెం గౌడ కులస్తుల పెద్దలు సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తహశీల్దారు తో పాటు పలువురు గౌడ పెద్దలు మాట్లాడుతూ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సిరిచెట్టి.కమలకార్,ఉపాధ్యక్షులుగా ముంజల.వసంతరావు,కోశాధికారిగా ముంజల.సాయిబాబ,ప్రధాన కార్యదర్శిగా పోగుల.రాము లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు సంద్య,అర్ఐ లు గౌడ కులస్తులు రావుల సోమయ్య, రావుల రవి, సారా సాంబశివరావు, పెద్ద రామలింగం, కమలాకర్, జలగం క్రిష్ణ, సాయిబాబా, మురళి, ప్రవీణ్, శేఖర్, కనకయ్య, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: