CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉప్పొంగిన జాతీయ భావం, సుమారు 4 వేల మందితో అశ్వారావుపేట లో ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన...

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు (ఆగస్టు 16) సామూహిక జాతీయ గీతాలాపనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు అశ్వరావుపేట రింగ్ రోడ్డు వద్ద నిర్వహించిన సామూహిక జనగణమన కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పార్టీల మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, విద్యాసంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు, వివిధ సంస్థలు సంఘాలు అలాగే రహదారులపై ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11.30కి ఎక్కడికక్కడే నిలబడి సామూహిక జనగణమన ఆలపించారు. అశ్వరావుపేట జంక్షన్ లో సుమారు 4000 మంది కార్యక్రమంలో పాల్గొన్నట్టు అంచనా. ఈ కార్యక్రమం కోసం పోలీస్‌ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు. అశ్వరావుపేట జంక్షన్ లో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటుచేశారు. స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు, జనగణమన పాడేందుకు వీలుగా మైకులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు. జంక్షన్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక మీద విద్యార్థులు దేశభక్తి గేయాలకు నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర్య భారత వజ్రొత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం అని, దేశం పట్ల మనందరికీ బాధ్యత ఉండాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జూపల్లి రమేష్, ఎంపీటీసీ వేముల భారతి, సర్పంచులు నారం రాజశేఖర్, నార్లపాటి సుమతి, అట్టం రమ్య, సాధు జ్యోత్స్నాబాయ్, డిఎంహెచ్ఓ దయానంద్, తహసిల్దార్ చల్ల ప్రసాద్, ఎంపీడీవో విద్యాదరావు, సిఐ బాలకృష్ణ, ఎస్ఐ చల్ల అరుణ, మండల నాయకులు బండి పుల్లారావు, మోహన్ రెడ్డి, ముబారక్ బాబా, తాడేపల్లి రవి, కాసాని చంద్రమోహన్, వికేడివిఎస్ విద్యార్థులు మరియు వివిధ సంఘాల నాయకులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: