CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వాతంత్ర్య వజ్రోత్సోవాలు సందర్భంగా అశ్వరావుపేట పట్టణంలో 2కె రన్.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అశ్వారావుపేట పట్టణంలో 2కె రన్ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ 2కే రన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు జూపల్లి రమేష్, తెరాస మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు చెన్నరావు, ఎంపీటీసీ వేముల భారతి, తెరాస సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, బిర్రం వెంకటేశ్వరావు, సర్పంచులు అట్టం రమ్య, నార్లపాటి సుమతి, మరియు అనేక పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు, సీఐ బాల కృష్ణ, ఎస్ఐ లు చల్ల అరుణ, ఇతర పోలీస్ అధికారులు, ఎంపీడీఓ విద్యాధరావు, ఎంపీడీఓ కార్యలయ సిబ్బంది, తహసీల్దార్ చల్ల ప్రసాద్, తహాసీల్దారు కార్యాలయ సిబ్బంది, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్, ఫారెస్ట్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అనేక సేవ సంఘాలు, సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2కె రన్ నిర్వహించినందుకు చాలా గర్వంగా ఉందని, మహాత్మా గాంధీతో పాటు మన తాతల తరాల వారు స్వాతంత్ర్యం కోసం పోరాడారని, ఈ వేడుకలు ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతాయని సీఐ బాలకృష్ణ తెలిపారు. అలాగే ఎంపీపీ జల్లిపల్లి శ్రీమూర్తి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగం వల్లే స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే.. అది వారి త్యాగాల ఫలమేనన్నారు. చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో 2కె రన్ నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క 2కె రన్ కి వెయ్యి మంది తగ్గ కుండా రావాలని పిలుపునివ్వగా 2 వేల మంది హాజరు అయినందుకు అశ్వారావుపేట మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంపీపీ అన్నారు. అదేవిధంగా 13వ తేదీ జెండా ర్యాలీకి 5000 మంది తగ్గకుండా రావాలని పిలుపునిచ్చారు.

Share it:

TS

Post A Comment: