CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రామన్నగూడెం గ్రామాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, రామన్నగూడెం గ్రామ ఆదివాసీలు చేస్తున్న ఉద్యమానికి ఆదివాసి సంఘం నాయకుడు హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్ తన మద్దతును తెలియజేశారు.తమ పట్టా భూములు తమకు అప్పగించమని,2012 లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమన్నందుకు, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆదివాసి మహిళా సర్పంచ్ మరియు మహిళలు గ్రామస్తులపై పోలీసుల దమనకాండ హేయమైన చర్య అని,ఇది ఏ రాజ్యాంగంలో ఉందని హైకోర్టు న్యాయవాది పెనుబల్లి రమేష్ ప్రశ్నించారు. రామన్నగూడెం గ్రామస్తులు 30, 36, 39 సర్వే నెంబర్లలో గల వారి పట్టా భూములు వారికి అప్పగించాలని చేస్తున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు పోలీసులను ఉసిగొల్పి వారిపై దాడులు చేయించడం ఎంత వరకు సభమని ఏజెన్సీ ఏరియాలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అమలులో ఉండగా ఆదివాసీలపై పోలీసుల దాడులు ఎలా జరుపుతారని, అర్ధరాత్రి ఆదివాసి నివాసాలపై దాడులు చేయటం ఎంతవరకు సమంజసమని.రామన్నగూడెంలో జరిగేది పోడు భూముల సమస్య కాదని,అక్కడ గిరిజనులకు పట్టా హక్కు పత్రాలు కలిగి ఉండి,అటవీ శాఖ వారు కలుపుకున్న భూమి తిరిగి తమకు అప్పగించాలని చేస్తున్న పోరాటమని,స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రామన్నగూడెం ఆదివాసీల భూమి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. రామన్నగూడెం ఆదివాసీలు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు తెలియజేస్తూ అన్ని రకాల అండదండలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, మడకం నాగేశ్వరరావు,గ్రామ ప్రజలు మరియు పాకనాటి శ్రీను,చెక్కిరాల శ్రీనివాసరావు, చిన్నంశెట్టి కుమారస్వామి, చందా నాగేశ్వరరావు,కూరం నరసింహారావు,పెనుబల్లి నరేష్,ఊకె వెంకటేష్,పద్యం బాలు,పెనుబల్లి అర్జున్,కారం లెనిన్,కోరం నాగబాబు,కాక దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: