CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నియోజక వర్గ కేంద్రంలో నల్ల బాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు.

Share it:

 


 మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గ కేంద్రం అయినా అశ్వారావుపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దా జిల్లా ఓబీసీ అధ్యక్షుడు తుమ్మ రాంబాబు అధ్యక్షతన సున్నం నాగమణి జెడ్పీటీసీ ములకలపల్లి & టీపీసీసీ మెంబర్ హాజరై నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టీపిసీసీ మెంబర్ సున్నం నాగమణి మాట్లాడుతూ ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీ ఆదేశాలతో నెహ్రూ, గాంధీ కుటుంబాల పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలియపర్చటం జరుగుతుందని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ చేసిన మనీ ల్యాండరింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తమని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఈడీని పావుగా వాడుకుని బిజెపి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. శక్తివంతమైన దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. గాంధీ కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని సున్నం నాగమణి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దిశెట్టి సత్యప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు భూసి పాండురంగ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తగరం రాజేష్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మెుద్దు మరియమ్మ, పట్టణ అధ్యక్షుడు చిన్నంశెట్టి రామకృష్ణ, ఎంపీటీసీ వేముల భారతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సంగ ప్రసాద్, మండల కోఆప్షన్ మెంబర్ ఎస్కె ఫాషా, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనువాసరావు, దమ్మపేట మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎస్కె సుకుర, ములకలపల్లి మండలం ఎస్టీసెల్ అధ్యక్షుడు కణితి సత్యనారాయణ, దమ్మపేట మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కె జానీ, నియోజక వర్గ యువ నాయకురాలు వగ్గెల పూజ, తలారూ జేమ్స్, ములగిరి కృష్ణ, వేముల ప్రతాప్, చిలక శ్రీను, పండు, జల్లిపల్లి దేవరాజ్, బాలగంగాధర్, సత్యవరపు, కుకల కంటి నాగబాబు, చెల్లా రమాదేవి, దర్శకులు చిప్పల యశోద, యాట్లధనలక్ష్మి, నరదల సర్వేశ్వరరావు, వజ్రమ్మ, ఎం నాగలక్ష్మి, మెట్ల నాగమల్లి, నంది కొల్ల మంగమ్మ, జంగం నాగమణి, అల్లాడి నిర్మల, బండి తులసి, దుర్గమ్మ, చావబోయిన అంజిబాబు, నరదల మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: