గుండాల జూలై 12(మన్యం మనుగడ) రైతులు ట్రాక్టర్ ఫుల్ వీల్స్ వేసుకొని రోడ్లపై తిరగవద్దని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఫుల్ వీల్స్ వేసుకొని రోడ్లపై తిరగడం వలన రహదారులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. నిత్యం మనం తిరిగే రహదారులను కాపాడుకోవడం కూడా మన బాధ్యత అని ఆయన అన్నారు. పొలాల్లో దిగేముందు ఫుల్ వీల్స్ ను వేసుకొని రోడ్డు ఎక్కేటప్పుడు తప్పనిసరిగా వాటిని తీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Navigation
Post A Comment: