CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి నది నీటిమట్టం పెరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.-స్వచ్ఛందంగా పునరావాస కేంద్రానికి ప్రజలు తరలి రావాలి.--:-జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జులై,ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వచ్చే వర్షాలు ఈసారి మనకు ముందుగానే రావడం జరిగిందని అన్నారు.మంగళవారం ములుగు జిల్లాలో 14.9 సెంటీమీటర్ల వర్షపాతం వెంకటాపురం మండలంలో 22.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ నుండి 18 ఇంచు మించు 11 లక్షల క్యూసెక్కుల గోదావరి నీరు మహారాష్ట్ర నుండి 4 లక్షలు చతిస్గడ్ మూడు లక్షలు మొత్తం 7 లక్షల క్యూసెక్కుల నీరు రావడం వల్ల రామన్నగూడెం గోదావరి నది 16.6 సెంటీమీటర్లు పెరిగిందని ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు.18 నుండి 19 క్యూసెక్కుల వరకు పెరిగి ప్రవసించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అన్నారు.గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు గ్రామాల ప్రజలను అధికార యంత్రంగా అప్రమత్తం చేస్తూ ములుగు జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు 25 పునరవాస కేంద్రాలను ఏర్పాటు చేశారని ఇప్పటి వరకు నాలుగువేల మంది ప్రజలకు పునరవస కేంద్రాలకు తరలించి,భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.ఐటీడీఏ పరిధిలో రోడ్లు వరదలు రావడం వల్ల రాకపోకలు నిలిచిన రోడ్లపై ఫ్లెక్సీలతో పాటు బారికేట్స్ ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.గోదావరి నది నీటిమట్టం పెరగడం వల్ల లోతట్టు మండలాలు తాడ్వాయి,గోవిందరావుపేట, ఏటూరు నాగారం,మంగపేట, వాజేడు,నుగూరు వెంకటాపురం,కన్నాయిగూడెం మండలాలలోని ముంపు గ్రామాల ఇండ్ల నుండి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించమన్నారు.పునరావాస కేంద్రాలుగా ప్రభుత్వ భవనాలను,వై టి సి సెంటర్లో ఒకటి ఐటిడిఏ ఆశ్రమ పాఠశాలలో మరొకటి ఏర్పాటు చేసి అధికారులు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ అన్నారు.రిస్క్ టీం బృందం తో వెంకటాపురం ఒక స్పీడ్ బోటు వాజేడు మండలానికి రెండు స్పీడ్ బోట్లు ఏటూరు నాగారం లో ఒక స్పీడ్ బోటుతో పాటు పిఓ ఐటిడిఏ నుండి ఒక స్పీడ్ బోటు సిద్ధంగా ఉంచామన్నారు వాజేడు వెంకటాపురం మండలంలోని లోతట్టు ప్రాంతంలో ఉన్న గ్రామాలకు నిత్యవసర సరుకులు కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.జిల్లా పోలీస్ యంత్రాంగం పాటు 200 మంది పోలీసులు,ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు.

సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నెంబర్,ఐటిడిఏ కార్యాలయం లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని అన్నారు.ఐటీడీఏ కార్యాలయం లో అన్ని వసతులు ఏర్పాటు చేసే మన్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share it:

TS

Post A Comment: