CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సార్వత్రిక ఎన్నికలను తలపించిన వడ్డెర సంఘం మండల ఎన్నికలు...- బ్యాలెట్ పద్ధతిన ఎన్నికల నిర్వహణ...

Share it:

 


- మండల అధ్యక్షుడిగా దండుగుల సాంబశివరావు గెలుపు...

మన్యం మనుగడ ప్రతినిధి 

చండ్రుగొండ: వడ్డెర సంఘం మండల అధ్యక్షుడి ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు తలపించేలా జరిగాయి. గురువారం చండ్రుగొండ మండల కేంద్రంలో జిల్లా వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు రాయల చందర్రావు, అధ్యక్షుడు ఉప్పతల ఏడుకొండలు, జిల్లా కార్యదర్శి దండుగుల పుల్లారావు, ఆధ్వర్యంలో వడ్డెర సంఘం మండల మహాసభను నిర్వహించారు. ముందుగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సభ్యులందరూ భావించారు. అధ్యక్షుడి పదవికి ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో సంఘం బాధ్యులు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలను బ్యాలెట్ పద్ధతినే నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సుమారు 300 మంది పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థి కుంచపు కాశీ మీద 105 ఓట్ల మెజార్టీతో దండుగుల సాంబశివరావు గెలుపొందారు. అభ్యర్థుల వారిగా ఓట్ల నమోదు.. దండుగుల సాంబశివరావు 174 ఓట్లు, కుంచపు కాశి 69 ఓట్లు, ఆలకుంట పుల్లయ్య 52 ఓట్లు, నోటాకు మూడు ఓట్లు నమోదు అయ్యాయి. మండల కమిటీ పూర్తి వివరాలు.. మండల అధ్యక్షుడిగా దండుగుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా కుంచపుకాసి, ఉపాధ్యక్షులుగా ఆలకుంట పుల్లయ్య, కోశాధికారిగా ఓర్సు రామకృష్ణ, సహాయక కార్యదర్శులుగా చింతల రాము, గోగుల తిరుమలరావు, కార్యవర్గ సభ్యులుగా శివరాత్రి విజయ్ కుమార్, పల్లపు సత్యం, ఆలకుంట నరసింహారావు, లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కుంచపు కన్నయ్య, భూపాల్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: