జూలూరుపాడు జూలై 30, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల కేంద్రంలో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షులు తెల్లం నరసింహారావు దొర పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 31న జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివాసి వైరా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో ఆదివాసి రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక పై చర్చించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా రాబోయే ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల నిర్వహణ, ఆదివాసీల సమస్యలు, చట్టాల పరిరక్షణ, పోడు భూమి సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఆదివాసి ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బచ్చల లక్ష్మయ్య, పూనెం సూరయ్య, తెల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: