CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన.జాతీయ మిర్చి టాస్క్ పోర్స్ కమిటీ డైరెక్టర్.అతి భారీ వర్షంతో వ్యవసాయ రంగానికి అపార నష్టం వాటిల్లింది

Share it:


  •  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మన్యం మనుగడ, మంగపేట.

గత మూడు రోజుల కురుస్తున్న అతి భారీ వర్షం వల్ల వ్యవసాయ రంగానికి అపార నష్టం వాటిల్లిందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. సోమవారం ఆయన గోదావరి వరద నీరు భారీగా రావడంతో నీట మునిగిన వరి నారు మడులను మరియు వర్షానికి దెబ్బతిన్న పత్తి క్షేత్రాలను గ్రామస్థులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ గోదావరి వరదలు రావడంతో వరి నారు మడులు బాగా దెబ్బతిన్నాయని అంతేకాకుండా మెరక ప్రాంతాల్లో సైతం మూడు రోజులు గా కురుస్తున్న వర్షాల వల్ల తెగుళ్లు చీడ పీడలు భారీగా వ్యాప్తి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మెట్ట పంటగా సాగు చేసిన ప్రత్తి మొక్కలు భారీ ఎత్తున చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి సమయంలో వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాహ కేంద్రం శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ కి సంబంధించిన అధికారులు రైతులకు సకాలంలో తగిన సూచనలు సలహాలు ఇచ్చి కనీసం ఉన్న పంట నైనా చేతికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.అదేవిధంగా వరి నారుమలు దెబ్బతిన్న రైతాంగానికి వరి విత్తనాలను సబ్సిడీపై మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట భాజపా మండల ఉపాధ్యక్షుడు తొండపు శ్రీనివాసరెడ్డి,గాదే నరేందర్ రెడ్డి,మాధవరెడ్డి,ఇమాన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: