CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ నయాగరా బొగతజలపాతం.అందాలు చూడతరమా.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు జూలై 8:


ఛత్తీస్ఘడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గుట్టల పైన కురిసిన భారీ వర్షాలకు బొగత అందాలు ఎంతో కమనీయంగా జలకల సంతరించుకుంది . 

ఈ జలపాతం నిండుకుండల మారి ప్రకృతి ప్రియులకు మరింత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇంత అద్భుతమైన జలపాతo అందాలు ఎక్కడో యూరప్ దేశాలలో ఉంది అనుకుంటున్నారా!

ఇది ములుగు జిల్లా, వాజేడు మండలం, చీకుపల్లి అనే కుగ్రామనికి 100 మీటర్ల సమీపంలో నల్లెందేవి, నల్లగుట్ట, కొండల మధ్యలో చుట్టూచూట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. మేనిని తాకే నీటి తుంపరలు.. పర్యాటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బొగత జలపాతం కనువిందు చేస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనసు దోచుకుంటుంది. గత రెండు రోజులుగా కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో జలపాతం జాలువారుతుంది. బొగత జలపాతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు.పచ్చని చెట్లు ఎత్తయిన కొండలు మధ్యలో జాలువారుతున్న నీటి సoద్రం ప్రకృతిని పరవశింపజేసే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పర్యటకుల మనసు మైమరిపించేలా పకృతి అందాలు, తెలంగాణ నయాగరా జలపాతం సొంతం.నీటి సంద్రం ఎత్తయిన ప్రాంతం నుంచి క్రిందకి జలువారుతున్న నిటిదార పాలనురగలా మారి ఆనందంతో పరవశించిపోయే ప్రకృతి ప్రియులు, బొగత జలపాతానికి పర్యాటకులు సందడి,సందడిగా మారి మినీ నయాగరా జలపాతం బొగత అందాలను చూడటం రెండు కళ్ళు చాలవు, ప్రకృతి ఒడిలో పుణికి పుచ్చుకొని అద్భుతమైన అందాలను దాచుకొని,పర్యటకులకు అహల్లాదకరమైన, వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ జలపాతాన్ని చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,రాష్ట్రాల నుండి ప్రకృతి ప్రియులు,పర్యాటకుల సందడి పెద్ద ఎత్తున మొదలైంది.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రకృతి ప్రియులకు, పర్యాటకులకు బొగత జలపాతం సమీపంలో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. జలపాతం లో ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఫారెస్ట్ అధికారి ఎప్ అర్ ఓ చంద్రమౌళి పేర్కోన్నారు.

Share it:

TS

Post A Comment: