CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోదావరి ముంపు ప్రమాదంలో పొదుమూరు గ్రామం.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మండలం లోని పొదుమూరు గ్రామం గోదావరి నది తీరంలో ఉండటం వలన ముంపు ప్రమాదం తీవ్రంగా ఉంది, పొదుమూరు గ్రామం ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు.ఈ విషయం లిఖిత పూర్వకంగా రాసి మంగపేట మండలం తహసీల్దార్ ఇచ్చి గ్రామం సమస్యలు తీర్చవలసినదిగా కోరడం అయినది.

ములుగు జిల్లా మంగపేట మండలం పొదుమూరు గ్రామ ప్రజలకు గోదావరి వరద ముప్పు 2015 పుష్కరాలు సంవత్సరం ఉందని గ్రహించిన ములుగు జిల్లా కలెక్టర్ దగ్గరనుండి మంగపేట తహశీల్దార్, పొదుమూర్ గ్రామ ప్రజలకు మూడు వందల కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఆదేశాలు రాత పూర్వకంగా పంపించిన మంగపేట మండల అధికారులు పట్టించుకోవడం లేదు అని,పొదుమూర్ గ్రామ ప్రజలు అసలే వర్షకాలం ఇప్పుడు పడుతున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగితే పొదుమూర్ గ్రామ ప్రజలు ఇండ్లు గోదావరిలోముంపు లో చిక్కుకొనే ప్రమాదం పొంచి ఉంది.అధికారులు పొదుమూరు ముంపు కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించకుంటే పొదుమూరు గోదావరి తల్లి ఒడిలో కలసిపోయినా పరవాలేదు... మేము మాత్రం మా ఇండ్లు విడిచి ఎక్కడకు వెళ్లే పరిస్థితి లేదు. పొదుమూరు లో ఉన్న మూడు వందల కుటుంబాలు అందరు షెడ్యూల్ కులాలు, వెనుకబడిన కులాలు, మైనారిటీ వర్గాల వారు ఎవరికీ స్వయంగా ఎక్కడికైనా వెళ్లి స్థలం కొనుక్కొని ఇండ్లు కట్టుకొనే స్థోమత లేదు.గత పదిహేను సంవత్సరాల నుండి వర్షాకాలం వస్తే ఎప్పుడు గోదావరి లో కలిసి పోతామో అని భయాందోళన తో బ్రతుకుతున్నారు.పొదుమూరు ప్రజల భయాన్ని పారద్రోలాలి అంటే అధికారులు శ్రద్ధ పెట్టి పొదుమూరు ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి.ఇప్పటి వరకు ములుగు జిల్లా కలెక్టర్ కు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ములుగు జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి ఈ విషయం విదితమే.ఎమ్మెల్యే, ఎంపీ,మంత్రులు,ముఖ్యమంత్రి కి కూడా విన్నవిస్తున్నాము ప్రతి ఒక్కరూ మా సమస్యను గమనించి మా పొదుమూర్ గ్రామ ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అని, డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని పొదుమూరు గ్రామ ప్రజలు కోరారు.ఈ కార్యక్రమం లో గుగ్గిళ్ల సురేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి దాసరి ఎల్లయ్య అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షులు ఎర్రావుల రమేష్,ఓడబలిజ సంఘం మండల అధ్యక్షులు

దాసరి నరేష్,అంబేద్కర్ యువజన సంఘం ప్రచార కార్యదర్శి,దాసరి వెంకటేశ్వర్లు, దాసరి సతీష్,బొల్లే లాలయ్యా, గుండెట్టి జంపయ్య,జంపయ్య, చిప్పనపెళ్లి బాబు,ఎట్ల నర్శింమూర్తి,డర్రా సతీష్, బాణాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: