CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని:సీఎం కేసీఆర్.

Share it:

 మన్యం టీవీ వెబ్ న్యూస్:


తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని,తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.  


ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ ఎఫ్, రెస్క్యూ టీం లను అప్రమత్తం చేయాలన్నారు.


మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ వున్ననేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులనుబట్టి నేడో రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. 


జిల్లాలల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సిఎం అన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టాలను జరగకుండా చూసుకోవలని ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 


ప్రజలకు విజ్జప్తి :


భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెల్లకుండా ఉండాలని, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్జప్తి చేశారు. 


ఇరిగేషన్ శాఖ అప్రమత్తంగా ఉండాలి:


గోదావరి ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో, ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.


రెవెన్యూ సదస్సులు వాయిదా:


భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11 న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవిన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు.. 15వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన ‘రెవిన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా వేస్తున్నట్టు సిఎం తెలిపారు.ఇందుకు సంబంధిచిన తేదీలను వాతావరణ పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ప్రకటిస్తామని సీఎం అన్నారు.

Share it:

TS

Post A Comment: