CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాజేడు ఏజెన్సీ ప్రాంతంన్ని హనుమకొండ సి పి చంద్రశేఖర్, ఎస్పీ సంగ్రమ్ సింగ్ పాటిల్, పర్యటన.

Share it:

 


                                        

మన్యం మనుగడ వాజేడు జూలై 19: 



ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరివాహక ప్రాంతాలు వాజేడు మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైపోయిన ఎన్నో ఆదివాసి గ్రామాలు సర్వం కోల్పోయాయి, దిక్కులేని పరిస్థితులలలో ప్రజలు అల్లల్లాడుతున్నారు. గోదావరి ముంపు వల్ల అంతరాష్ట్ర సరిహద్దులో రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతరాష్ట్ర సరిహద్దులైన చత్తీస్గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వాజేడు మండలం టేకులగూడెం గ్రామానికి హనుమకొండ సిపి, చంద్రశేఖర్, ఎస్పి ,సంగ్రమ్ సింగ్ పాటిల్ , పర్యటన చేశారు. ఈ పర్యటన నేపథ్యం అంతరాష్ట్ర సరిహద్దుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంతరాష్ట్ర సంబంధాలకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ముంపుకు గురైన గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు.ఈ పర్యటనలో ఓ ఎస్ ది, గౌస్ ఆలం, ఏ ఎస్ పి అశోక్ కుమార్, సి ఆర్ పి ఎఫ్, సి పి వృషలి , సి ఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: