CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆనందపురం గ్రామపంచాయతీలో ప్రభుత్వ విప్ రేగా విస్తృత పర్యటన..

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఆనందపురం గ్రామపంచాయతీలోని పలు గ్రామాలు ఇటీవల గోదావరి ముంపు గురైన లోతట్టు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు.గోదావరి వరద ముంపు ప్రాంతాల సమస్యలపై భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ విన్నవించానని ఆయన అన్నారు.పినపాక నియోజకవర్గం లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 13 వేల బాధిత కుటుంబ సభ్యులకు ఇంటింటికి 10 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.ప్రజలకు వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపడానికి రూ.1000 కోట్లు ప్రకటించారని ఆయన అన్నారు.ముంపుకు గురైన ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం,కుటుంబానికి రెండు నెలలపాటు 20 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.ముంపు ప్రాంతాలలోని ప్రజలందరికీ శాశ్వత ప్రాతిపదికన కాలనీలను నిర్మిస్తామని అన్నారు.భద్రాచలం కరకట్ట మరింత ఎత్తు వెడల్పు చేసి ప్రతిష్టంగా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆయన అన్నారు.

గోదావరి వరదలతో ముంపునకు గురవడంతో నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద 25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, స్థానిక ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు , వైస్ ఎంపీపీ,ఎంపీటీసీలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: