CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జలగ లంచ వాగు కల్వర్టును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం


ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగ లంచ వాగు గత రెండు రోజులుగా ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కల్వర్టు వాగు వరద ఉధృతికి తెగి పోవడం తో శనివారం తెగిపోయిన కల్వర్టును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.జనజీవనం అస్తవ్యస్థంగా మారిందనీ,దీనికి తోడు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పస్రా -ఏటూరునాగారం మధ్యలో ఉన్న జలగటంచువాగు ప్రవాహానికి ఏకంగా కల్వర్టులు ధ్వంసమయ్యాయని యుద్ద ప్రాతిపదికన అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని సీతక్క అన్నారు.జోరున కురుస్తున్న వర్షాలు,ఏకధాటిగా ప్రవహిస్తున్న వరదలతో ములుగు జిల్లాలో పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని, 

పంచాయతీరాజ్​,ఆర్అండ్​బి, నేషనల్​ హైవేస్​ వరదల తాకిడికి కొన్ని కోతకు గురికాగా మరికొన్ని కొట్టుకుపోయాయని ​రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రోడ్ల నిర్మాణాల కోసం ములుగు నియోజక వర్గానికి నిధులు మంజూరు చేయాలని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,సర్పంచులు ఇర్ప సునీల్,రేగా కల్యాణి,

సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య,జిల్లా నాయకులు ఆర్రెమ్ లచ్చు పటేల్,ముదర కోళ్ల తిరుపతి,

సహకార సంఘం డైరెక్టర్ సిద్ది రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,

గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్,గంట సాయి రెడ్డి, రాము,మధు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: