CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి సన్నద్దం కావాలి: టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నేతల పిలుపు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


సమాజంలో మీడియా స్పేచ్చకు,జర్నలిస్టుల హక్కులకు ప్రమాదం ఏర్పడుతోందని,జర్నలిస్టులు ఐక్యతతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్

(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నేతలు అన్నారు. మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు పోరాటానికి సన్నద్దం కావాలని వారు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాచలంలోని శుభం గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యలు ప్రసంగించారు. తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహిచిన జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని, ఇళ్ళస్దలాలు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను పరిష్కరిస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలను గాలికొదిలేసి జర్నలిస్టులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులను సమాయత్తం చేసి త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులకు ఇళ్ళస్దలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో జర్నలిస్టుల ఫెడరేషన్ ను బలోపేతం చేసి జర్నలిస్టులకు అండగా ఉండాలని అన్నారు. ఈ మహాసభలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లాం వెంకట్రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి కే. నర్సారెడ్డి, సంఘసేవకులు డాక్టర్ నవీన్ బాబు, ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బండి విజయ్ కుమార్, కర్ర అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి చిర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గం.


తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భద్రద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడుగా పూదోట సూరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొలిశెట్టి రమేష్, ఉపాధ్యక్షులుగా మునగాల వెంకటాచారి, తోటమల్లి రమణమూర్తి, డి. రవికుమార్, ఏ. మధులిక, కార్యదర్శి గా డి. వెంకటేశ్వర్లు (డీవీ), సంయుక్త కార్యదర్శులు గా నిమ్మ లింగారెడ్డి, రాజేందర్, సంపత్ రెడ్డి, కె. దామోదర్, కోశాధికారి గా దొడ్డ హరినాగవర్మ, కార్యవర్గ సభ్యులు గా బోడ లక్ష్మణరావు, ఏ. పుష్పగిరి, బొగ్గుల శివనాగిరెడ్డి, రాధాకృష్ణ, దామళ్ళ వెంకన్న, ఎంటీ శంకర్, నర్సింహా రావు, ఈశ్వర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితోపాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కర్ర అనిల్ రెడ్డి,కటారి కృష్ణ, రాళ్ళబండి కృష్ణమూర్తి, మేడిపల్లి వెంకటేశ్వర్లు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు గా చిర్ర శ్రీనివాస్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Share it:

TS

Post A Comment: