మన్యం మనుగడ వాజేడు జూలై 22:
వాజేడు మండలంలో ముంపు గ్రామాలలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే పోదాం వీరయ్య పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ప్రజలను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన గ్రామాల పరిస్థితి అగమ్య గోచరగా ఉంది. టేకులగూడెం, కృష్ణాపురం, కడేకల్, పెద్ద గంగారం, పెద్ద గొల్లగూడెం, వీరాపురం, చికుపల్లి, గుమ్మడిదొడ్డి, సుందరయ్య కాలనీ, దూల పురం, గ్రామాలలో కుటుంబాల పరిస్థితి, కనీస నిత్యవసర సరుకులులేని పరిస్థితిలో ఉన్నారంటే గోదావరి నది ముంపు ప్రాబల్యం ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. ఈ గ్రామాలకు ఎమ్మెల్యే పోదాం వీరయ్య సందర్శించి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముంపుకు గురైన కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. నీట మునిగిన గ్రామాలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని స్థానిక సర్పంచ్లకు సూచించారు. వ్యాధులు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కొన్ని గ్రామాలలో పంట చేలలో రాళ్లు, ఇసుక మేటలు వేయడం, బంజరు భూమిల తలపించేల కనబడుతుంది. ఇంకో దిక్కు రోడ్ల సౌకర్యం లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు.పలు గ్రామాల భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేక పోయినా సరే పరిస్థితులను అధిగమించి గ్రామాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తల్లడి, ఆదినారాయణ, గుమ్మడిదొడ్డి సర్పంచ్,పాయం, విజయలక్ష్మి,పూనేం రాంబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: