CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విశ్వ బ్రాహ్మణులకు కించపరిస్తే సహించేది లేదు..

Share it:

 


దమ్మపేట జూలై 02 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు విశ్వబ్రాహ్మణులపై కించపరిచే విధంగా మాట్లాడటాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం యువ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు హైకోర్టు న్యాయవాది తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆనాడు ఇదే విశ్వబ్రాహ్మణులు, చార్యులు అయిన తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కారకుడు,తెలంగాణ రాష్ట్ర సృష్టికర్త అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చార్యులు, తెలంగాణ ఉద్యమం లో అగ్నికి ఆహుతులు అయిన ఉద్యమ యువ నాయకుడు శ్రీకాంతచారి చార్యులు తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించి గొప్ప చరిత్ర కలిగిన మహానుభావులు విశ్వబ్రాహ్మణులు, చార్యులది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ చరిత్ర కలిగిన విశ్వబ్రాహ్మణులు, చార్యులు వీరే ఉద్యమం లో లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగేదా అని ప్రశ్నించారు. వారు ఆనాడు చేసిన పోరాటాలు ఉద్యమాల ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆనాడు ఉద్యమ సమయంలో అమెరికా లో ఉద్యోగం చేస్తూ ఉన్నా కేటీఆర్ ఈరోజు రాష్ట్రము సాధించిన తరుణం లో ఉన్నత పదవులు అనుభవిస్తున్న కేటీఆర్ ఉద్యమం చేసిన వర్గాల ప్రజలను పప్పు చారీలు అని కించపరిచే విధంగా మాట్లాడిన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యమం చేసింది ఉద్యమాలలో పాల్గొన్నది చార్యులు, అసలు ఉద్యమ సమయంలో నువ్వెక్కడున్నావ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రము లో ఉద్యమ నాయకులను ఉద్యమ సమయంలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలను నాయకులను మోసం చేయడమే కాకుండా అధికార అండతో ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసిన తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెరాస పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ది చెప్పే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయని తెలియాచేస్తూ విశ్వబ్రాహ్మణులు, చార్యులు అందరూ కూడా ఐక్యతగా ఉండాలని వారికి పూర్తిగా మద్దతు గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందని ఒక కులాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భద్రాద్రి జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, అశ్వారావుపేట నియోజకవర్గ యువ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు హైకోర్టు న్యాయవాది ఈ కార్యక్రమం లో దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వరరావు మండల నాయకులు పాకనాటి శ్రీనివాసరావు ,చక్రాల శ్రీను పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: