CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం--:ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ‌సభ్యురాలు,నక్కా శైలజ .

Share it:


  • జిల్లా వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ జయప్రదం

మన్యం మనుగడ, పినపాక:

పినపాక డివిజన్: స్థానిక పినపాక మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘము చేపట్టిన బంద్ విజయవంతమైంది. మండలంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు నక్కా శైలజ, డివిజన్ నాయకులు రాకేష్ మాట్లాడుతూ పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలల్లో అనేక సమస్యలు విద్యార్థులను వేధిస్తున్నాయనీ, ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం గాలికొదిలేసిందనీ,ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంచినీరు, టాయిలెట్స్ వంటిమౌలిక సదుపాయాలు లేవని, ఉపాధ్యాయుడే బడి గంట కొట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, పాఠశాలలకు గ్రాంట్స్ కేటాయించట్లేదనీ, రాష్ట్రవ్యాప్తంగా 20వేల పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, యూనివర్సిటీలో ప్రొఫెసర్,నాన్ టీచింగ్ పోస్టులు 60 శాతం ఖాళీలు ఏర్పడ్డాయనీ అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందనీ, ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన మధ్యాహ్న భోజనం మెనూ చార్జీలు పెంచాలనీ, ప్రతిరోజు కోడిగుడ్డు అందిస్తూ పౌష్టికాహారం అందించాలని అన్నారు, రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడంలో జిల్లా అధికారులు వైఫల్యం చెందారని ఇప్పటివరకు కేవలం 40 శాతం పాఠ్య పుస్తకాలు మాత్రమే అందించారని అన్నారు.ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటివరకు నోట్ పుస్తకాలు ఇవ్వలేదని, బ్లాంకెట్స్,ప్లేట్లు,గ్లాసులు,ట్రంక్ బాక్సులు,టవల్స్ సకాలంలో అందించడం లేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3800 కోట్ల రూపాయలు విద్యార్థులకు స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు. మన ఊరు-మన బడిపథకంలో జిల్లాలో 300 పాఠశాలలను మాత్రమే చేర్చారనీ, అన్ని పాఠశాలలను చేర్చి మరమ్మత్తులు చేయవలసిన అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో,కళాశాలల్లో బోధనా సిబ్బంది లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్నారు. ప్రతి ఏటా బస్ పాస్ చార్జీలను పెంచుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.తక్షణమే ఆయా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చి, ప్రభుత్వ పాలన స్తంభింప చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పినపాక మండల కార్యదర్శి రాకేష్, కమిటీ సభ్యులు, వశిం పాషా, మురళి, అఖిల తదితరులు పాల్గొన్నా రు.

Share it:

TS

Post A Comment: