CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళిత బంధు తో దళితుల జీవితాల్లో నూతన కాంతులు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు మంజూరు అయిన యూనిట్లను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.మణుగూరు మండలం లంక మల్లారం గ్రామానికి చెందిన గంగారపు రమేష్ కు దళిత బంధు ద్వారా దీపాలకు అవసరమైన వత్తులు తయారు చేసే చిన్న పరిశ్రమను స్థాపించారు.ఈ పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, దళిత బంధు పథకం ద్వారా తాను లబ్ధి పొందటమే కాకుండా తన చిన్న పరిశ్రమ నందు 22 మంది స్థానిక మహిళలకు ఉపాధిని కల్పించడం చాలా అభినందనియం అని లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం పగిడేరు శాంతి నగర్ కు చెందిన పప్పుల ప్రసాద్ నూతన పద్మశ్రీ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి సూపర్ మార్కెట్ ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు.అనంతరం బండారు గూడెం మెయిన్ రోడ్డు పూల మార్కెట్ సెంటర్ నందు బూర్గుల సంజీవరావు దీవెన రెడీమేడ్ షోరూమ్ ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల లో వెలుగులు నింపడమే పథకం లక్ష్యం అని తెలిపారు.దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలియజేశారు.దళిత బంధు గొప్ప పథకం అని,దళితులను ఆర్ధికంగా తెలంగాణ రాష్ట్రం దళిత బంధు పథకం ద్వారా దళితులకు చేయూతనిస్తూ, వారిని అన్ని రంగాలలో ఎదిగేలా ప్రోత్సహిస్తుందని అన్నారు.దళిత బంధు పథకం దళితులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు ఐక్యతకు నిదర్శనం గా మారిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణలో మాత్రమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజం అవుతున్నాయని,దళితుల జీవితాల్లో వెలుగులు నింపేలా దళితులను బలోపేతం చేసేందుకు ఎటువంటి పూచీకత్తు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా దళితులకు రూ.10 లక్షలను అందించే గొప్ప పథకం *దళిత బంధు* అని తెలిపారు.దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్,రూపకల్పన చేసి ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారని విప్ రేగా తెలిపారు.ఇది ఎంతో అద్భుతమైన పథకమని ఇటువంటి పథకం గతంలో ఎప్పుడూ చూడలేదని విప్ రేగా తెలిపారు.దళిత బంధు పథకం ను ఇంత గొప్పగా విజయవంతం చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం.విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,మున్సిపల్ కమీషనర్ మాధవి,ఎంపీడీఓ వీరబాబు,ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, మండల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు,కో అప్షన్ జావిద్ పాషా,సర్పంచ్ లు,మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు,మహిళ కార్యకర్తలు,టిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: