CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మా భూములు మాకే ఇవ్వండి, -కలెక్టర్ ను కోరిన 28 కొండరెడ్ల కుటుంబాలు.ఇందిరా సాగర్ ప్రాజెక్టు రద్దవడంతో భూములు అప్పగించాలని రైతుల వినతి.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:మండల పరిధిలోని తిరుమలకుంట రెవెన్యూలో ఉన్న రెడ్డిగూడెం గ్రామపంచాయతీ నుండి ఆనాడు ఇందిరాసాగర్ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంకు ఇచ్చిన భూములు ప్రాజెక్టు రద్దు అయిన మూలంగా తిరిగిమా భూములు మాకే అప్పగించాలని కోరుతూ రెడ్డిగూడెం గ్రామపంచాయతీ గ్రామాల కొండరెడ్లు సుమారు 28 కుటుంబాలు జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రుద్రంకోట నుండి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రారంభించిన ఇందిరా సాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆనాడు ఇందిరా సాగర్ ప్రాజెక్టు కోసం తిరుమల కుంట రెవెన్యూ పరిధిలోని, రెడ్డిగూడెం, మధ్యరెడ్డిగూడెం, సుద్దగోతులగూడెం, బండారు గుంపు, నారంగుంపు గ్రామ (ఎస్.టి) 'కొండరెడ్డి కోయ' గిరిజన రైతులు తమకున్న ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాలు భూములను ప్రభుత్వం కల్పించిన అతి తక్కువ నష్టపరిహారానికే ప్రభుత్వానికి అప్పగించారు. ఆనాటి నుండి భూములు కోల్పోయిన కొండరెడ్లు కూలినాలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు రుద్రంకోట ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పైపులైను రిజర్వాయరు నిర్మాణము కొరకు 15.04.2010వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినారని, అట్టి నోటిఫికేషన్ ప్రకారం మాకు మా భూములు అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట రెవిన్యూ రికార్డు దాఖలా రెడ్డిగూడెం, బండారు గుంపు, మధ్యరెడ్డిగూడెం, సుద్దగోతులగూడెం, నారం గుంపు గ్రామాల (ఎస్.టి) గిరిజన రైతుల వద్ద నుండి 'ఎసైన్డ్' పట్టా భూములు సుమారు య. 180 (నూట ఎనభై)లు సేకరించి, ఒక ఎకరమునకు రూ.1,15,000/-లు నష్టపరిహారము గిరిజన రైతులకు చెల్లించినారని, కాలక్రమంలో సదరు రిజర్వాయరు ఇందిరా సాగర్ పైపులైను రద్దు పరిచినట్లు పత్రికలద్వారా తెలిసిందని, గిరిజన రైతులమైన మాకు 2017వ సంవత్సరము వరకు 1-బి నమూనా పహణీలు వచ్చినవని, ఆ తరువాత 1-బిలు, పహాణీలు ఈ సేవా ద్వారా రావటం లేదని, గిరిజన రైతులమైన మాకు బ్యాంకు ఋణములు లేక చాలా ఇబ్బందులు పడుచున్నామని, వ్యవసాయమునకు పెట్టిబడి లేక ఇబ్బందులు పడుచున్నామని, రుద్రంకోట, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకము, రిజర్వాయరు రద్దు పరిచినందున గిరిజన రైతులమైన మాకు ఆ యొక్క భూములకు మేము వ్యవసాయము చేసుకునే విధంగా హక్కు కల్పించి రెవిన్యూ రికార్డులలో నమోదు చేసి గిరిజన కొండరెడ్డి కోయ రైతులకు పట్టాలు మంజూరు చేసి గిరిజన రైతులమైన మాకు న్యాయంచేయగలరని కలెక్టర్ అనుదీప్ ను కొండరెడ్లు కోరారు. ఈ విషయమై 28 కొండరెడ్డి సంక్షేమ కుటుంబాలకు పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండరెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు చిప్పల కొమ్మిరెడ్డి, ఆదివాసి సంఘం కొండరెడ్ల సంఘం సమన్వయ నాయకులు ఉమ్మల దుర్గారెడ్డి, జిల్లా కార్యదర్శి బొల్లు వెంకటేశ్వర రెడ్డి, ఉమ్మల బాబు రెడ్డి, బొల్లు లచ్చిరెడ్డి, ఉమ్మల శ్రీనివాస్ రెడ్డి, బొల్లి వెంకటేశ్వర్ రెడ్డి, చిప్పల వెంకన్న బాబు రెడ్డి, చిప్పల లక్ష్మి, ఊకే ప్రసాదు, చిప్పల నీలారెడ్డి, యాట్ల ధనలక్ష్మి, చిప్పల సావిత్రి, చిప్పల పుల్లమ్మ, బొల్లు నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: