CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని జులై 27న ఐటీడీఏ ముందు మహాధర్నా.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

 మంగపేట మండల కేంద్రంలో ప్రజాసంఘాల సమన్వయ కమిటీ సమావేశము నర్రా శివప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 అమలు చేయకుండా  నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారుల నుండి దరఖాస్తుల స్వీకరించి 8 నెలలు పూర్తయిన సర్వేలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని పేర్కొన్నారు .జిల్లాలో అనేక గ్రామాలలో ఫారెస్ట్ అధికారులు పోడు భూములను ట్రాక్టర్లతో దున్న

కుండా గ్రామాలలో కందకాలు తీస్తూ హరితహారం పేరుతో బలవంతంగా భూములు లాక్కొని మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. అడ్డువచ్చిన పోడు సాగుదారులపై తప్పుడు కేసులు పెడుతూ భయానిక వాతావరణం కల్పిస్తున్నారు.ప్రభుత్వం పోడు సాగుదారులకు సర్వేలు శాటిలైట్ ఆధారంగా కాకుండా గొలుసులు పెట్టి గ్రామ పెద్దల సాక్షాలు కనుగుణంగా కొలవాలని దరఖాస్తు చేసుకున్న భూములన్నిటికీ హక్కు పత్రాలు ఇవ్వాలని జూలై 27న ఐ టి డి ఏ ఏటూరునాగారం కార్యాలయం ముందు జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సాగుదారులకు ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కబ్బాక బాబు, రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడు ఎల్ పి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ నాయకులు తోకల రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: