CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వెల్లి విరిసిన మానవత్వం... నిరుపేద బాలిక కంటి శస్త్ర చికిత్సకి చేయూతనిచ్చిన "జే.డీ.పౌండేషన్".

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 ఆపదలో ఉన్న వారిని ఒక్కసారి ఆదుకోవడమే గగనం అయిపోతున్న ఈ రోజుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక చంటి పాపని, ఆమె తల్లిని అన్ని విధాలుగా ఆదుకుని వాళ్ళని ఆశించే స్థాయినుంచి తిరిగి సాయం చేసే స్థాయికి నిలబెట్టారు జే.డీ ఫౌండేషన్ భద్రాచలం వారు, వివరాల్లోకి వెళితే భద్రాచలం పక్కన ఉన్న కుక్కునూరు గ్రామానికి చెందిన బంట ఆదిలక్ష్మి భర్త గత సంవత్సరం పాము కాటు తో చనిపోగా ఉన్న ఒక్కగానొక్క కూతురు 6 సంవత్సరాల సారిక ప్రమాదవశాత్తు కంటికి గాయమై ఒక కన్ను కోల్పోగా 2వ కంటికి ఇన్ఫెక్షన్ సోకడంతో, ఈ స్థితిలో జే.డి ఫౌండేషన్ ని మీడియా మిత్రుడు యర్రంశెట్టి కృష్ణ ద్వారా సంప్రదించగా తక్షణమే  ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నందు దాతల సహకారంతో మొదటి విడత శస్త్ర చికిత్స చేయించి ఒక కంటి ని కాపాడగలిగారు తదుపరి జెడి ఫౌండేషన్ ఉపాధి భరోసా ద్వారా శ్రీమతి ఆదిలక్ష్మికి టైలరింగ్ లో శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్ ని అందించారు, ప్రస్తుతం ఆదిలక్ష్మి ఒక  పుట చిన్న హోటల్ లో పని చేసుకుంటూ,మరో పుట మిషన్ కుట్టుకుంటూ తన కూతుర్ని చక్కగా చదివిస్తుంది, అయితే ఇటీవలే మరొకసారి కంటికి శస్త్ర చికిత్స అవసరమవగా గత 3 రోజుల క్రితం  హాస్పిటల్ నందు శస్త్ర  చికిత్స చేయటానికి కూడా జెడి ఫౌండేషన్ ఇతర దాతల సహకారం అందించగా, ఆపరేషన్ విజయవంతం అయ్యి ఇప్పుడు పాప కంటి చూపు మెరుగు అయింది. తనకు భవిష్యత్తుపై ఆశ కల్పించి తన బిడ్డకి  కంటి చూపు ప్రసాదించిన జెడి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జేడీ లక్ష్మీ నారాయణ గారికి, కన్వీనర్ మురళీమోహన్ కుమార్, హన్సి, కడాలి నాగరాజుకి, హైదరాబాద్ కి చెందిన శ్రీమతి మానస, నాగ మోహన్,జొన్నలగడ్డ యశస్వి గారికి మరియు ఇతర ఫౌండేషన్ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని ఆదిలక్ష్మి తెలిపారు.

Share it:

TS

Post A Comment: