CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి హక్కుల చట్టాలపై శిక్షణ తరగతులను విజయవంతం చేయండి.ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ.

Share it:


మన్యం మనుగడ వాజేడు జూన్ 29.



వాజేడు మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు. అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 

తుడుం దెబ్బ,జాతీయ అధ్యక్షులు రమణాల లక్ష్మయ్య. రాష్ట్ర అధ్యక్షులు వట్టం, ఉపేందర్. పాల్గొని వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు ముందు నుండి నేటి వరకు 200 సంవత్సరాల పైగా ఆదివాసీలు విరోచిత పోరాటాలు చేసి వేలాది మంది ప్రాణాలు అర్పించిన తర్వాతనే అంచలంచలుగా అటవీ ప్రాంతాలకు హక్కులు కల్పించారు. స్వతంత్రయము అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆదివాసులకు సర్వ హక్కులు కల్పిస్తూ 5,6 షెడ్యూల్ అను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. యొక్క షెడ్యూల్ అను దృష్టిలో పెట్టుకొని1/59,1/70 చట్టాలను, పెసా చట్టాలను షెడ్యూల్ ప్రాంతాలలో పటిష్టంగా అమలు చేయడం కొరకు ఆదివాసి ప్రజలను చైతన్యం చేసి మన హక్కులు, మన చట్టాలు మనమే రక్షించుకోవాలని మేడారం కేంద్రంగా 

తుడుం దెబ్బ శిక్షణ తరగతులు జులై రెండు, మూడు, తేదీలలో శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసి భవనం మేడారంలో నిర్వహించ బడును, కావున ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం, ఆదివాసీల అస్తిత్వ రక్షణ కోసం, పరితపించే ఆదివాసి ప్రజలకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ.అని వారు అన్నారు. ఆదివాసి యువత, ఆదివాసి మేధావులు, ఆదివాసీ ప్రజలు, ఈ యొక్క శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని బుధవారం వాజేడు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో కరపత్రాన్ని తుడుం దెబ్బ నాయకులు ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎట్టి రాజబాబు, మండల కార్యదర్శి కారం సురేందర్. తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: