CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నకిలీ విత్తనాలతో రైతన్నలు జర జాగ్రత్త.నకిలీ విత్తనాలతో ఆర్థికంగా నష్టపోతున్న రైతులు.

Share it:


 మన్యం మనగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో పత్తి అధిక ధర ఉండటంవల్ల పత్తి పంట పండించుటకు మొగ్గు చూపిస్తున్న రైతులు. పత్తి పంట పండించుటకు మొగ్గు చూపిస్తున్న తరుణంలో నకిలీ పత్తి విత్తనాలు అంట కట్టేందుకు అందుకు కొంత మంది నకిలీ విక్రయదారులు పన్నాగాలు చేస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం. అశ్వాపురం మండలం లో గిరిజన గ్రామాలు అయిన తుమ్మలచెరువు, వెంకటాపురం, గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకల గూడెం, కళ్యాణపురం, మీట్టగూడెం, అమ్మ గారి పల్లి, మనుబోతులపాడు, చింత్రియాల చింత్రియాల కాలనీ, ప్రాంతాలలో రైతులు ఎక్కువ మోతాదులో పత్తి పంటను పండిస్తారు. మిగిలిన గ్రామ పంచాయతీలలో కూడా తక్కువ మోతాదులో పత్తిపంటను పండిస్తారు. ఈ సంవత్సరం పత్తి అధిక ధర ఉండటంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వేయుటకు తమ భూములను చదును చేసి సిద్ధంగా ఉన్నారు. గతంలో మండలంలోని అనేక మంది దళారులు అమాయక గిరిజన రైతాంగానికి నకిలీ పత్తి విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు కాపు సరిగ్గా లేక దిగుబడి తగ్గిపోవడంతో తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు. గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్రప్రభుత్వం నకిలీ విత్తనాల పై కొరడా చూపుతూనే ఉంది. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతుంది. *ఆధారైజుడు డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలి: ఏవో సాయి శాంతన్ కుమార్*. మండలంలోని పత్తి పండించే రైతులు పత్తి విత్తనాలు ప్రభుత్వం గుర్తించిన ఆదారైజుడు డిలర్ల వద్ద కొనుగోలు చేయాలనీ ఏవో సాయి శాంతన్ కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సీల్ ప్యాకింగ్ లో ఉన్న విత్తనాలను ఎక్స్పర్ట్ తేదీ క్యూఆర్ కోడ్ చూసి కొనుగోలు చేయాలి. విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలియజేశారు.కొనుగోలు చేసిన డీలర్ల వద్ద తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, మండలంలో ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలను విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ సమాచారాన్ని రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందికి తెలపాలని కోరారు.

Share it:

TS

Post A Comment: