CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఆదివాసి ఇలవేల్పు ముయ్యాలమ్మ జాతర.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు జూన్ 10: 

ఆదివాసీల ఇలవేల్పు ముయ్యాలమ్మ తల్లి జాతరను వాజేడు మండలం చికుపల్లి గ్రామంలో మూడవ గట్టు (గొంది) వంశస్థులు ఘనంగా నిర్వహించారు.

 దట్టమైన అడవి...చుట్టూ కొండలు...పక్కన సెలయేరు వేదికగా వెలసిన గోంది వంశీయుల ఇలవేల్పు ఆదివాసీల దేవతగా వెలసి ప్రస్తుతం అందరి దైవంగా ముయ్యాలమ్మతల్లి విలసిల్లుతోంది. కొలిచిన వారి కోర్కెలు తీరుస్తూ.. కొంగుబంగారం చేస్తూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ముయ్యాలమ్మ జాతర ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది , ఆదివాసీల ఇలవేల్పు ముయ్యాలమ్మ కొలువుదీరి ఉంది. రోజువారీగా ఈ జాతరకు భక్తులు వస్తునప్పటికీ ప్రతీ రెండేళ్లకొకసారి ఈ ముయ్యాలమ్మ జాతరను మహాజాతరగా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. జాతర నిర్వహిస్తున్న సమయంలో ముయ్యలమ్మ దేవత ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుందని ఆదివాసీల నమ్మకం. మూడు రోజుల పాటు చేతలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు.   

అందరి దేవత... ఆదివాసీ ఇలవేలుపుగా వెలసిన ముయ్యలమ్మను ఆదివాసీలతోపాటు నేడు ఆదివాసేతరులు కూడా తమ ఇష్ట దైవంగా కొలుస్తున్నారు. ఏజెన్సీతోపాటు ఇతర జిల్లాల నుంచి ముయ్యాలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు ముయ్యాలమ్మ దేవతను దర్శించుకోవడం పుణ్యప్రద్రం,ఆ దేవత నుండి తీసుకున్న కుంకుమ, పసుపును చాలా పవిత్రంగా ఆదివాసీలు, పంటపొలాల్లో విత్తనాలను కలిపి ఆదివాసీల ఇలవేల్పు దైవాన్ని మొక్కి పంట పనులు ప్రారంభిస్తారు.ఇలా చేస్తే పంట దిగుబడి వస్తుందని ఆదివాసిలకు ఆనవాయితీగా వస్తున్న నమ్మకం. ఈ కార్యక్రమం పూజారి గొంది శ్రీను, చిట్టి లక్ష్మయ్య, వడ్డే, పూసం, నర్సింగరావు, శివ నాద్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: