CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల్లో అహ్లాదకరమైన వాతావరణం - ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో సీజన్ వ్యాధులు స్వస్తి.

Share it:

 


  • - జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య....

 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :

పల్లె ప్రకృతి వనాల తో గ్రామీణ ప్రాంతాల్లో అహ్లాదకరమైన వాతావరణం నెలకొందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా బుధవారం చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ముందుగా పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. అక్కడి నుంచి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులను పరిశీలించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని, వైకుంఠధామాన్ని, నర్సరీ నీ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం,పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందన్నారు. ప్రతి రోజు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు పూర్తిగా తగ్గాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో పాటు అన్ని రకాల పరీక్షలు కూడా ప్రభుత్వమే చేయిస్తూ ప్రతి పేదవాడికి కేసిఆర్ కొండంత అండగా ఉంటున్నారని అన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనం వద్ద మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దిన పంచాయతీ సర్పంచ్ కార్యదర్శిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపీటీసీలు దారా బాబు, భుక్యా రాజీ, సర్పంచ్ గుగులోత్ నిరోషా, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, మాలోత్ బోజ్యా నాయక్, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఉన్నం నాగరాజు, భూపతి శ్రీనివాసరావు, భూపతి రమేష్, గుగులోత్ శ్రీనివాస్, భుక్యా మూర్తి, కీలోత్ శ్రీను, ఎంపీడీవో డి అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్, పంచాయతీ కార్యదర్శి శైలజా, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: