CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

క్రీడా దుస్తుల పంపిణీ.

Share it:


 దమ్మపేట జూన్ 19 ( మన్యం మనుగడ ) : అంకంపాలెం స్వగ్రామం లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం యువ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు హైకోర్టు న్యాయవాది యువకులకు 70 టీషర్ట్ లు, 20 లోయర్ లు మరియు క్రికెట్ కిట్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ క్రిడల్లో మంచి ప్రతిభ కనపరచాలని తద్వారా ప్రతిభ కలిగిన యువకులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని వాటిని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని నేటి యువతే రేపటి బావితరాలకు మార్గదర్శకులు కావాలని కోరడం జరిగింది. అదే విధంగా యువత నేటి కాలంలో రాజకీయలలోకి రావాల్సిన అవసరం ఉందని మరి ముఖ్యం గా గిరిజన యువకులు రాష్ట్ర మరియు దేశ రాజకీయాలపై అవగాహనా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. ఉదాహరణకు నేను ఒక గిరిజన ఆదివాసీ బిడ్డ గా ఈ గ్రామంలోనే పుట్టి పెరిగి ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం మన గ్రామానికి గర్వకారణంగా ఉందని తెలియచేస్తున్నాను. మీరు కూడా క్రీడల్లో, చదువుల్లో అన్నీ రంగాలలో రాణిస్తూ ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో యువకులు గ్రామ అభివృధి కి తోడ్పాటు అందించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాముల వెంకటేశ్వరావు గ్రామ యువకులు కాకా భారత్ , కాకా రమేష్ , శ్రావణ్, కూరం నర్సింహారావు, పెనుబల్లి ధర్మ ,,పొట్ట వెంకటరావు, కొండ్రు శ్రవణ్ ,పైదా బాలు, వాడే వినోద్,కాక దిలీప్, సోడెం సందీప్, ఊకే వెంకటేష్,పోతురాజు,లక్షణరావు, వెంకటప్రసాద్, చరణ్, రాజేంద్ర, పొట్ట శ్రీను, ఊకే అనిల్,నందిగాం సిద్దూ, వల్లెపు చిన్ని, ప్రశాంత్, మహేష్, వర్ధన్, సృజన్, సురేంద్ర, గ్రామ యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: