CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి రైతు ను జలగం వెంగళరావు ట్రస్ట్ ద్వారా ఆదుకుంటాం :- జలగం ట్రస్ట్ చైర్మన్ జలగం ప్రసాదరావు.

Share it:

 


గుండాల జూన్ 13(మన్యం మనుగడ) జలగం వెంగళరావు ట్రస్టు ద్వారా మండలంలోని రైతులను ఆదుకుంటామని జలగం ట్రస్ట్ చైర్మన్ జలగం ప్రసాదరావు అన్నారు. సోమవారం ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో కలిసి గుండాల మండలంలో పర్యటించారు. మండలంలోని కాచన పల్లి, మామ కన్ను, అంబరాశిపల్లి, తురు బాక, మోదుగుల గూడెం, ముత్త పురం, పడుగోనుగూడెం, వేపల గడ్డ గ్రామాల్లో వారు పర్యటించారు, విద్యుత్ లైన్ బోర్, నదీ పరివాహక ప్రాంతం ఉన్న రైతులు కొంతమేర డబ్బు చెల్లిస్తే మిగతా సగం ట్రస్టు ద్వారా చెల్లించి రైతులకు మోటార్లు అందజేస్తామని అన్నారు. 3 హెచ్పి మోటర్ కోసం 14 వేల రూపాయలు రైతు చెల్లిస్తే చాలని మిగతాది తాము చెల్లిస్తామని అన్నారు. పట్టా ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాంబాబు, జిల్లా నాయకులు అన్వర్, తాసిల్దార్ కిషోర్, ఎంపీపీ భక్తి సత్యం, ఎంపీడీవో హజరత్ వలి, సర్పంచ్ సమ్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, నాయకులు వీరస్వామి, అబ్దుల్ నబీ, నిట్ట రాములు, యువజన విభాగం నాయకులు అజ్జు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: