CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రమదానం లో పాల్గొన్న పినపాక మండల ఎంపిపి.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం పంచాయతీ పోతిరెడ్డిపల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి లో భాగంగా శ్రమదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ హాజరయ్యారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో శ్రమదాన కార్యక్రమం జరిగింది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు రాజకీయ ప్రతినిధులు, ఏడూళ్ల బయ్యారం సర్పంచ్ కోరం రజిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గల పిచ్చి మొక్కలు వేరి వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు  దొడ్డ శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, సెక్రటరీ హరీష్, గ్రామ అధ్యక్షుడు బూర రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: