CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ స్థలంలో గిరిజనేతరులు నిర్మించిన అక్రమ బహుళ అంతస్తులను కూల్చి వేయాలి... వారిపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేయాలి..ఏఎస్పిడిమాండ్..

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండల కేంద్రంలో లక్ష్మినగరం గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 118/1, 118/2 ప్రభుత్వ భూమిలో కొందరు గిరిజనేతరులు 1/70 చట్టానికి విరుద్ధంగా అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణం కూల్చివేసి వారిపై ఎల్ టి ఆర్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భం వారిపై తీసుకోవాలని కోరుతూ మండల డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ వినతి పత్రం సమర్పించారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రవి మాట్లాడుతూ గిరిజనేతరుల ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు అని ఆదివాసీ సంక్షేమ సంఘం తరఫున రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దీని అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు ప్రభుత్వ స్థలాల్లో లో అక్రమంగా ఆక్రమించుకునే నిర్మాణాలు చేపడుతున్న గిరిజనేతరుల పై చర్యలు తీసుకోకపోతే ఆదివాసీ సంక్షేమ సంఘం తరఫున కూల్చివేయడం జరుగుతుందని అని తెలియజేశారు. ఈ విషయం మండల అధికారులు స్పందించకపోతే ఎస్టీ కమిషన్ హైదరాబాదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కి ఉద్యమ కార్యాచరణతో ఫిర్యాదు చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిచ్చోడి మారయ్య, మచ్చ దుర్గారావు, వెంకటేష్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: