CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జర్నలిస్టుల సమస్యల పరిష్కరించడమే టిడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం - రాష్ట్ర కౌన్సిల్ జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా టిడబ్ల్యూఎఫ్ ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర కౌన్సిల్ జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ కర్ర అనిల్ రెడ్డి అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో టిడబ్ల్యూజేఎఫ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల సీనియర్ రిపోర్టర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు నేరెళకుంట సుధాకర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామిశెట్టి సైదయ్య ఆధ్వర్యంలో 22 మంది టిడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వాలు స్వీకరించారు. ఈసందర్భంగా కర్ర అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ముందు వరుసలో ఉంటుందన్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదన్నారు. అదే జర్నలిస్ట్ కి ఉండటానికి ఇల్లు లేక సరైన ఆర్థిక వనరులు లేక కుటుంబ పోషణ కూడా ఇబ్బందికరంగా మారిందన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అర్హులైన జర్నలిస్టులు అందరికీ పింఛన్లు, జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ తో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కే కృష్ణారావు జిల్లా జాయింట్ సెక్రెటరీ డి రవికుమార్, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు పి.సూరిబాబు, కోశాధికారి వెంకటేశ్వర్లు, మండల రిపోర్టర్లు నేరళకుంట సుధాకర్ (వెలుగు), రామిశెట్టి సైదయ్య (నమస్తే తెలంగాణా), ఎంవీ కోటా చారి (ఆంధ్రప్రభ), వెలగల మధు (ప్రజా పక్షం), యస్ కే జాఫర్ (తెలంగాణ కేసరి), కంచర్ల కృష్ణ ప్రసాద్ (టైమ్స్ ఆఫ్ వార్త), బొగ్గుల శివనాగిరెడ్డి (విజయం), పూసం రాంబాబు (జ్యోతి), ఎడవెల్లి లింగయ్య (ప్రజా ప్రతినిధి), కుంజా వెంకటేష్ (మన్యం టీవీ), ఉసికల దయాకర్ (ప్రజావాక్యం), కుక్కడపు నరేష్ (ప్రజాదర్బార్), సయ్యద్ నూరురబ్బాని (కానుక), మహ్మద్ యాకూబ్ పాషా (జనంసాక్షి), సంకా కృపాకర్ (మనం), ఉప్పతల గణేష్ (పవర్), ఉప్పతల వాసు (సూర్య), సౌడమ్ వెంకటేశ్వర్లు (ఏ1న్యూస్), టి రాందాస్ (111న్యూస్), కృష్ణ నాయక్ (కొమరం భీం), పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: