CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లోని మండల తహశీల్దార్ కార్యాలయం నందు మండల వ్యాప్తంగా 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ.15,01,740/- రూపాయల విలువగల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం నాడు ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు ఆసరాగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని,పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుక గా రూ.1,00,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ సర్కారు అని ఆయన గుర్తు చేశారు.సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కెసిఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెండ్లి చేసే వరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతోమంది పేద కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని అన్నారు.కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలు అమలు లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని తెలియజేశారు.ప్రజలకు కావలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ,తహసీల్దార్ భగవాన్ రెడ్డి,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు,వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, సర్పంచ్ ఎస్.స్వప్న,స్థానిక ఎంపీటీసీలు,సర్పంచులు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, టిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి. శ్రీనివాసరావు,స్థానిక టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,మహిళా కార్యకర్తలు,యువజన నాయకులు,అభిమానులు,పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: