CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులను వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఆదుకోవాలి.భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు అమర్లపుడి రాము డిమాండ్.

Share it:


దమ్మపేట జూన్ 13 ( మన్యం మనుగడ ) : రాష్ట్ర రైతాంగానికి ముఖ్యంగా కౌలు, సన్న ,చిన్నకారు రైతులకు పత్తి మిర్చి విత్తనాలు తో సహా అవసరమైన అన్ని విత్తనాలు,ఎరువులను, ప్రభుత్వం ఉచితంగా అందించాలని ,వ్యవసాయ పరికరాలు యంత్రాలు సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని, కల్తీ విత్తన వ్యాపారాన్ని అరికట్టాలని,నేరస్తుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన వడ్డీలేని రుణాలు అందించాలని, అన్ని పంటలకు ఈ సంవత్సరం అయినా పెట్టుబడి ఖర్చులు అన్నిటిని లెక్కించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం- C2+ 50% ప్రకారం M.S.P. నిర్ణయించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ధరలు పంటలకు ముందుగానే ప్రకటించాలని, అఖిలభారత రైతుకూలి సంఘం AIKMS రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు దమ్మపేట లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు మెమోరాండం ఇవ్వడం జరిగింది 

ఈ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు అమర్లపూడి రాము మాట్లాడుతూ వానాకాలం సాగుకు అవసరమైన రుణాలు సకాలంలో అందించాలని,రుణమాఫీ ఒకేసారి చేయాలని, పత్తి, మిర్చి, విత్తనాల తో సహా రైతాంగానికీ అవసరమైన అన్ని రకాల విత్తనాలు ఎరువులు ఉచితంగా రైతులకు ముఖ్యంగా కౌలు ,సన్న, చిన్నకారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని, డిమాండ్ చేశారు 

ఈ ఏడాది వానాకాలం పంటలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఇందుకు ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం రబీ సీజన్ కష్టాలు, కన్నీళ్లు దిగమింగి కోటి ఆశలతో సాగుకు సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగం గురించి మాటలు చెపుతున్నది కానీ అందుకు తగినట్లుగా వ్యవహరించలేదు అని అన్నారు

సకాలంలో సరైన వ్యవసాయ ప్రణాళిక రూపొందించి పూనుకోలేదు, తోడ్పాటు లేదు, గతంలో నామమాత్రపు ధరతో అందించిన పచ్చిరొట్ట విత్తనాలు సైతం ఈసారి అందించడం లేదు, కొనుక్కో మంటున్నది అలాగే ఇతర పంటల విత్తలన్ని మార్కెట్లో కొనుక్కో వలసిందే రైతుబంధు రుణమాఫీ ఇస్తున్నామని పేరిట రుణాలు అందజేతలేదు. ఎరువుల పరిస్థితి అదే ఇట్టి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం 2022-2023 ఖరీఫ్ సీజన్లో పూర్తిగా వడ్డీవ్యాపారులపై ఆధారపడి కష్టాల సాగుకు పూనుకుంటున్నారు 

సాగు రంగం సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో ఇది నష్ట కరం 

పాలకుల తప్పుడు విధానాల వలన, సాగుకు ప్రభుత్వం సాయం విడనాడినందున వడ్డీ వ్యాపారాలు, కల్తీ విత్తన వ్యాపారులు, గ్రామాలలో మధ్యవర్తుల ద్వారా కల్తీ విత్తనాలు ఎరువులు అమాయక రైతులకు అంట గట్టి పిండుకోవటానికి సిద్ధపడుతున్నారని,అయినా ప్రభుత్వ అధికారులు కొన్ని చర్యలు దాడులతో చేతులు దులుపుకుంటున్నారని, పూర్తిస్థాయిలో నేరస్థులను అరికట్టలేకపోతున్నారని, అందుకనే సమగ్ర కేంద్ర చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ,కురసం మంగమ్మ,తలుపుల కృష్ణవేణి AIKMS మండల నాయకులు తాటి సత్యం ,కుంజా కాంతారావు, చాప ముత్యాలరావు, వాడే గిరి ,కేసరి వెంకటేష్ , సోయం సీతారాములు, మడివి శ్రీను, సున్నం కృష్ణ రావు, కుంజా వంశి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: