CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లెలు,పట్టణాల అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు.రూ.10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సి సి రోడ్డు పనులను ప్రారంభించిన విప్ రేగా కాంతారావు..

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం రూ.10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సి సి రోడ్డు పనుల మరియు తరగతి గదులకు రూ.5 లక్షలతో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రికల్ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.గడిచిన 60 ఏళ్లలో సాధ్యం కాని ప్రగతిని కేవలం ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఆచరణలో అమలు చేసి చూపించారని వారు అన్నారు. ప్రతి పల్లెల్లో సిసి రోడ్లు,బిటి రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం,గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు అందజేస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది అన్నారు.పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పనులు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులే అందుకు నిదర్శనం అని తెలిపారు.రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా మని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ కుమారి, జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీ ల సంఘం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,ఎంపీటీసీ రమ్య,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ భారతి,స్థానిక ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు, కార్యదర్శులు రామిరెడ్డి,నవీన్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, కార్యదర్శి రవి ప్రసాద్,మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్,స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: