CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి.

Share it:

 


మన్యం మనుగడ ములుగు

ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ,బస్సు డిపో,ఆర్ టి ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా నాయకులు నెమలి నరసయ్య మాదిగ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొలిపాక ప్రశాంత్ హాజరై మాట్లాడుతూ... ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ వెంటనే ఏర్పాటు చేయాలని జాకారం వై టి సి భవనంలో తరగతులు వెంటనే ప్రారంభించాలని గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ములుగు జిల్లా కేంద్రానికి కేటాయించారని చింత కృష్ణ అన్నారు.ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో తరగతులు ప్రారంభమయ్యాయని మొదటి సెమిస్టర్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని వారు అన్నారు.గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని చింత కృష్ణ అన్నారు.పసర సెంటర్లో 17వ తేదీన పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో దిగ్బంధం నిర్వహిస్తామని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ అన్నారు.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య మాదిగ మాట్లాడుతూ. ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అని నరసయ్య అన్నారు.జిల్లా కేంద్రమైన కూడా బస్సు డిపో ఏర్పాటు చేయకపోవడం చాలా బాధకరమని ఆయన అన్నారు. పక్క ప్రాంతాలైన పరకాల, భూపాలపల్లి,నర్సంపేట ప్రాంతాలలో బస్సు డిపో లు ఉన్నాయని,ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో లేకపోవడం వల్ల హనుమకొండ నుండి మణుగూరు వరకు ఒక బస్సు డిపో కూడా లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 కిలోమీటర్ల కు ఒక బస్సు డిపో ఉండాలి కానీ నూట యాభై రెండు వందల కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఎక్కడ బస్ డిపో ఏర్పాటు చేయలేదని, రాత్రి తొమ్మిది దాటితే హనుమకొండ నుండి ములుగు బస్సులు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన కూడా ఆర్ టి ఏ కార్యాలయం ఇంతవరకు ఏర్పాటు చేయలేదని,సుదూర ప్రాంతాల నుండి భూపాలపల్లి కి వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే ములుగు జిల్లా కేంద్రంలో ఆర్ టి ఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో దద్ధరిల్లిన నినాదాలు మార్మోగిన నినాదాలు మార్మోగిన గిరిజన యూనివర్సిటీ బస్ డిపో ఆర్టీసీ నినాదాలు అందుకే ఇప్పటికైనా ఉద్యమాలు ఉధృతం కాకముందే ప్రజా ప్రతినిధులను అడ్డుకోక ముందు గిరిజన యూనివర్సిటీ బస్సు డిపో ఆర్ టి ఏ కార్యాలయం వెంటనే ఏర్పాటు చేయాలని ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు.వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమంలో కలిసి రావాలని కోరుతున్నాం లేనిచో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంఘాల కుల సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మహాజన సోషలిస్టు పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి జన్ను రవి,ములుగు ప్రజా సంఘాల జేఏసీ నాయకులు నూనె శ్రీనివాస్, ముని ఖాన్,సిపిఐ జిల్లా నాయకులు చిక్కుల వెంకటేశ్వర్లు,గుట్టమీద ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండె మీద వెంకటేశ్వర్లు, మ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఓరుగంటి అనిల్, మౌనిక,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నాదునూరి రమేష్,సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కొత్తపెళ్లి యాకూబ్,ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ప్రసాద్, ముదురు కోళ్ల తిరుపతి, చెన్నూరి లక్ష్మయ్య,వాణి,ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: