CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి....

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకోవాలని ఎస్ ఐ గొల్లపల్లి విజయలక్ష్మి యువతకు దిశానిర్దేశం చేశారు గురువారం బెండాలపాడు పాఠశాల ఆవరణలో స్థానిక పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న ఎం కోటేశ్వరరావు సమకూర్చిన స్టడీమెటీరియల్ ను కానిస్టేబుల్ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె యువతకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ అవ్వాలంటే పట్టుదల ఉండాలని, యువకులు పరుగు తో పాటు, వ్యాయామాలు శిక్షణ చేయడంతోపాటు, స్టడీ మెటీరియల్ ను సైతం టైం టేబుల్ మెనూ సిద్ధం కావాలన్నారు. 100% ఏ పని చేసిన ఆ పనిపై వంద శాతం విజయం సాధించగలరు. ఈ పట్టుదల ప్రతి పనిలో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో చండ్రుగొండ కానిస్టేబుల్ ఎం కోటేశ్వరరావు మండలంలో ఎవరు చేయనిది నిరుద్యోగులకు మెటీరియల్ అందజేయడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా నిరుద్యోగులకు ప్రత్యేక మెటీరియల్ అందజేసిన చండ్రుగొండ కానిస్టేబుల్ కోటేశ్వరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లలిత, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: