CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరులో ఘనంగా మే డే ఉత్సవాలు:పట్టణంలో భారీ బైక్ ర్యాలీ.సీనియర్ కార్మికు లను సన్మానించిన నాయకులు.

Share it:


  • పోరాటాల ద్వారానే హక్కులను,సాధించుకుందాం:సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ అయోధ్య


మన్యం టీవీ మణుగూరు:


ఎందరో కార్మికులు హక్కుల కోసం తమ ప్రాణ త్యాగం చేశారని,వారి పోరాట ఫలితంగానే మే డే జరుపుకుంటున్నామని,మే డే కార్మికులకు పండుగ దినం అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ అయోధ్య అన్నారు.మణుగూరులో ఆదివారం నాడు మేడే 136వ ఉత్సవాలను ఘనంగా గ్రామ గ్రామాన,కార్మిక వాడలో, మండలంలో పట్టణంలో సుమారు 60 ఎర్ర జెండాలు ఎగరేసుకుని,అనంతరం మణుగూరు సి ఎస్ పి కాట వద్ద బొగ్గు ముఠా కార్యాలయం,గుమస్తా కార్యాలయం ఎదుట,ఆటో యూనియన్ అడ్డ లలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి అయోధ్య జెండా ఆవిష్కరించారు.అనంతరం సీనియర్ కార్మిక లైన బొగ్గు ముఠా,గుమస్తాల సంఘ నాయకులను వారు ఘనంగా శాలువా కప్పి సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. అనంతరం ఎర్ర చొక్కా లు ధరించిన కామ్రేడ్స్ బైక్ లపై సి ఎస్ పి కాట నుండి టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా బీ అయోధ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం వారి రక్షణ కోసం నిరంతరం ఏఐటీయూసీ పోరాటం కొనసాగిస్తుందని,ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో అనేక హక్కులు సాధించుకుందామని *పోరాడితే పోయేది ఏమీ లేదు- బానిస సంకెళ్లు తప్ప* అనేది రుజువైందని వారు గుర్తు చేశారు.ఈ దేశంలో 30 కోట్ల మందికి పైగా కార్మిక రంగంలో సంఘటిత,అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వారి హక్కుల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు చట్టాలు కోడు లుగా విభజిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని,భారత కార్మికులు వ్యతిరేకించారు.అయినా బిజెపి ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కార్మిక హక్కులు కాలరాసే విధంగా ప్రభుత్వాలు చూస్తున్నాయని దీనిని కార్మికవర్గం తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.ఎ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ,మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి లు మాట్లాడుతూ,కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని,ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్,కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఏ ఐ టి యు సి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్,సిపిఐ మణుగూరు మండల పట్టణ కార్యదర్శులు ఎస్ కే సర్వర్ దుర్గ్యాల సుధాకర్,ఏ ఐ టి యు సి మండల అధ్యక్ష కార్యదర్శి తోట రమేష్,అక్కి. నరసింహారావు బ్రాంచ్ ఉపాధ్యక్షులు బీ వీరస్వామి సర్పంచ్ బాడిస సతీష్, ఎంపీటీసీ లక్ష్మయ్య,కామిశెట్టి రామారావు,వార్డు మెంబర్లు లక్ష్మణరావు,మాజీ ఎంపీపీ ఎడారి రమేష్,నాయకులు చింతల దశరథం,బొగ్గు ముఠా సంఘం అధ్యక్ష కార్యదర్శులు జక్కుల రాజబాబు,శ్రీకాకుళం వీరమల్లు,పరాల మల్లయ్య లింగస్వామి మదర్ సాబ్ గుమస్తా సంఘ నాయకులు భీమరాజు,కృష్ణ,రఘువరన్ నరసింహారావు రామకోటి మంగి వీరయ్య సొన్ దే కుటుంబరావు బత్తుల లక్ష్మయ్య,ఆదరణ రాములు కన్నెబోయిన ప్రసాద్,మంద కోటి,రావుల రాములు,కె వి నారాయణ ఎస్ వి నాయుడు బార్ షాప్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొండలరావు,ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కొత్తపల్లి సత్యనారాయణ ప్రసాద్ ,ఎక్స్ ఫ్లో జ్యూస్ నాయ,కులు ఎర్రయ్య ,యాకయ్య రవికుమార్,బుచ్చి రాములు

మ్యాజిక్ యూనియన్ నాయకులు సిరి గడ్డ సతీష్, మణుగూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కొత్తపల్లి సీతారాములు,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పవన్ మురళి, పూర్ణ,దండుగుల బాబు, రాయల బిక్షం మహిళలు మాజీ ఎంపీటీసీ మంగమ్మ,అలివేలు, బత్తుల లక్ష్మి కొంతమంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: