CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు లో ఈటెల ప్రెస్ మీట్..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిని ఫారెస్ట్ అధికారులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఒకపక్క భూములు లాక్కుంటూ, రెండో పక్క పోడు సాగు భూముల్లో వ్యవసాయ బోర్లు ఏయ్యకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు పరిష్కారం చేయలేదని, గిరిజలకు రావలసిన 9 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేయలేదని, తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలను నమ్మటం లేదని, రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పోవడం ఖాయమని, బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని ఈటల అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని ) బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్, బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్ , కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేను సతీష్ , జిల్లా కార్యదర్శి గుగులోతు రమేష్, పోనిశేట్టి వెంకటశ్వర్లు , బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి భూక్యా రాజేష్, భూక్య శ్రీను, భూక్య రమేష్ , వూర్లమోట్టీ రవి, గోపాల్ రావు, సుబ్బకిరణ్, లక్ష్మణ అగ్రవాల్ హరిహర యాదవ్ ,బొగి కృష్ణ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: