CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అసత్య ప్రచారం మానుకొని నియోజకవర్గం అభివృద్ధి పై ద్రుష్టి పెట్టండి.టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

సోమవారం మంగపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క తెరాస ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరైనది కాదు,

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం ఎమ్మెల్యే సీతక్క కు తగదు, పక్క రాష్టం మీద రైతులకు ఉన్న ప్రేమ మన రైతుల మీద లేదు అనడం అది ఎంత వరకు సమంజసం అనే ఆలోచించండి.కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెరాస ప్రభుత్వం రైతుని రాజు చేయడానికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు దేశంలోఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుచున్నది,తెలంగాణా రాష్టంలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కడైనా ఉంటే చెప్పండి, రైతు కోసం, సాగు నీటికోసం, త్రాగు నీటి కోసం, కెసిఆర్ చేసినంత కృషి ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ప్రజల కోసం పాటు పడ్డారో తెలియజేయండి, తెలంగాణా లో 2014 కు ముందు పరిపాలించిన ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి ప్రజలకు తెలియనిది కాదు,ఇప్పుడు తెలంగాణా వ్యవసాయం దేశానికి తల మాణికం, అటువంటి అపర భగీరథ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాగుండాలని ఆలోచించి ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఎకరానికి,10 వేల రూపాయలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ,రైతు బంధు ఇస్తున్నది నిజం కాదా, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న మాట నిజం కాదా, రైతు మరణిస్తే రైతు కుటుంబాలకు రైతు భిమా రూపంలో 5లక్షల రూపాయలు ఇస్తున్నది నిజం కాదా, రైతులకు ఇవే కాకుండా రైతులకు సాగునీటి ఇవ్వడానికి,ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, మరియు,బ్యారేజ్ లు కట్టి రైతులకు సాగునీరు అందిస్తున్నది మీకు కనపడటం లేదా,తెలంగాణలోని అన్నివర్గాల రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తూ,ఢిల్లీలో సంవత్సరం కాలం పాటు దీక్షలో పాల్గొని రైతు ధర్నా లో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్, హర్యానా,రైతులకు కూడా మంచి మనసుతో తన వంతు సహాయం గా ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పున చెక్కులు పంచడాన్ని తప్పు పడుతున్న మీరు, మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్గాడ్,రాష్టంలో రైతుల గురించి రైతు బాగోగుల గురించి ఏ రోజు కూడా మీ పార్టీ ఆ రాష్ట్రంలో ఉన్న రైతులను పట్టించుకున్న సందర్బం లేదని ప్రజలందరికి తెలుసు,మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలలో మీరు చెప్పుతున్న రైతు డిక్లరేషన్ రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ ఎందకు ఇవ్వడం లేదో చెప్పాలి ,అధికారం కోసమే రైతుల పట్ల మొసలి కన్నీరే కారుస్తున్నారే తప్ప రైతుల మీద ప్రేమ లేదు అని తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు.గతంలో పాలించి మీరు తెలంగాణ ను ఎడారిగా మార్చి రైతు వలసలు కారణం అయినది మీరు కదా. ఈరోజు మా నాయకులు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెరాస ప్రభుత్వాని ,విమర్శించడం సరైనది కాదు. ఇప్పటికైనా తెరాస పార్టీ పైఅసత్య ఆరోపణలు మానుకొవాలి.

తెలంగాణ మేము ఇచ్చామని చెప్పుకునే మీరు ,తెలంగాణ లో 12 వందల విద్యార్థుల ఆత్మ బలి దానాలకు ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కాదా,తెలంగాణ ప్రజలు కోట్లాడి ఉద్యమం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారే తప్ప తెలంగాణ మీద ప్రేమతో మీరు తెలంగాణ ఇవ్వలేదు అట్లా ఇచ్చేవారే అయితే అన్ని సంవత్సరాలనుండి ఏమి చేశారు, అయిన ఇచ్చిన వారిదే గొప్ప అని అనుకుంటే భారతదేదానికి స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళది గొప్పతనమా లేక దాస్య శృంఖలాల విముక్తి కోసం పోరాడిన వీరులు గొప్పవారా మీరు ఒక్క సారి ఆలోచించుకోవాలి, ఇకనైనా తమరు తెరాస ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం మానుకొని నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాలి,స్వంత నియోజకవర్గం లోని రోడ్లు, విద్య, వైద్యం మొదలగు సౌకర్యాలు ప్రజలకు అందించటం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుక వచ్చి నియోజకవర్గం అభివృద్ధి చేయండి అని టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఈ సందర్బంగా తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: