భద్రాచలం ITDA రోడ్, వెంకటేశ్వర కాలనీ లో గల శ్రీ సీతారామ దాసాంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి చేతులమీదుగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కన్నులపండగగా నిర్వహించారు. ఉదయం నుండి అభిషేకం, హనుమాన్ పారాయణం, కల్యాణం మరియు 2000 మంది భక్తులకు పైగా అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ MLA శ్రీ పొదేం వీరయ్య, మేజిస్ట్రేట్ జడ్జి శ్రీ సురేష్, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు శ్రీ బోగాల శ్రీనివాస రెడ్డి, కాగ్రేస్ నాయకులు బుడగం శ్రీనివాస్, నల్లపు దుర్గా ప్రసాద్, ఆదిత్య, ట్రస్ట్ మెంబర్లు రామ్ ప్రసాద్, రవి, గ్రీన్ భద్రాద్రి టీం ఉప్పాడ రామ్ ప్రసాద్ రెడ్డి, పామరాజు తిరుమల రావు, కడాలి నాగరాజు, జిమ్ రామి రెడ్డి, అన్నెం వెంకటేశ్వర రెడ్డి, రాచమల్ల రాము, ఆర్.కె.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: