CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట లో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటారు వాహనాల చట్టంను సవరించి మోటారు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న తలపెట్టిన జాతీయ బందును జయప్రదం చేయాలని, దానిలో భాగంగా ఈరోజు మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలనే అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా అశ్వారావుపేటలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కార్మికులకు కర్షకులకు వ్యతిరేకంగా అనేక నల్ల చట్టాలను తీసుకు వచ్చారని, కొన్ని చట్టాలను రైతాంగ విరామం లేని పోరాటాల వలన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ఇంకా అనేక చట్టాలు కార్మికులకు కర్షకులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ చట్టాలను కూడా రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వారు తెలిపారు. మోటార్ కార్మికులపై కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, విపరీతంగా చలానాలు విధించడమే కాకుండా, చలానాలు కట్టడం ఆలస్యమైతే రోజుకు 50 రూపాయలు పెనాల్టీ విధించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 19వ తేదీన జరగబోయే జాతీయ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ అరెస్టులను ఖండించిన అఖిల పక్ష నాయకులు కార్మిక హక్కుల కోసం, మోటారు కార్మికుల పై జరుగుతున్న చలానా దోపిడీని నిరసిస్తూ ఈనెల 19వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపునివ్వడం జరిగిందని, దశల వారి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని, ఇటువంటి కేసులను ఎత్తివేయాలని అఖిలపక్ష నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, సయ్యద్ సలీం, రఫీ, అర్జున్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: