CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంకై న్యూడెమోక్రసీ ర్యాలీ, ధర్నా.

Share it:

 



ములకలపల్లి: 

 పోడు భూముల సమస్య తో పాటు, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఐ ఎం ఎల్ (న్యూ డెమోక్రసీ) భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ములకలపల్లిలో సోమవారం భారీ ప్రదర్శన, తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు మాట్లాడారు. వ్యవసాయ సీజన్ దగ్గరికి వచ్చిందని, నేటికీ పొడుభూముల సమస్య పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఫారెస్ట్ అధికారులు, పోలీస్ సాయుధ బలగాల అండతో, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, పోడు భూముల చుట్టూ కందకాలు తవ్వుతున్నారని, అడ్డుకున్న పోడు సాగు దారులపై అక్రమ కేసులు బనాయిస్తూ, ప్రభుత్వం నియంత పాలన సాగిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా సాగులో ఉన్న పోడు భూములు అన్నిటికీ పట్టాలు ఇవ్వాలని, పోడు భూముల ఆక్రమణలు ఆపాలని డిమాండ్ చేశారు. పోడు భూముల చుట్టూ అనేక గ్రామాల్లో నేటికి విద్యుత్  సౌకర్యం లేదని తక్షణమే ఆయా గ్రామాలకు విద్యత్ సౌకర్యం కల్పించాలని కోరారు. మండలంలో గుండాలపాడు, సుందర్నగర్, తోగూడెం గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆ గ్రామాలకు రోడ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంవత్సరానికి 200 పనిధినాలు కల్పించాలని, కనీస వేతనం రూ.600 ఇవ్వాలని కోరారు. అంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం తహశీల్దార్ వీరభద్రం కు అందించారు. కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోర రవి, పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, వై ఎస్ రెడ్డి,  ఉమ, సవళ్ల ఆదినారాయణ, రాజు, వంక సురేష్, అక్కమ్మ, ముదిగొండ మల్లయ్య, పొడుగు నర్సింహారావు, తిరుపతయ్య, సత్యం , శ్రీరాములు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: