CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన ఊరి బడులకు మహర్దశ. వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, గోపాల రావు పేట గ్రామాల్లో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల నందు 31 లక్షల రూపాయల అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న ప్రభుత్వ బడులకు విరివిరిగా విరాళాలు అందించి సర్కారీ బడుల అభ్యున్నతి కోసం తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

 అవసరమైన చోట మరమ్మతు పనులను చేపడుతూ, అదనపు తరగతి గదులు, నిర్మాణాలు, లైబ్రరీ, ప్రహరీ గోడ, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్, ఫర్నిచర్, డిజిటల్ విద్యాబోధనకు, సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. విద్యారంగాన్ని ప్రతిష్ట పరిచేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం సర్కారు బడుల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన మెరుగుపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పినపాక మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: