CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సాగు దారులకుపట్టాలివ్వాలని రిలే నిరాహార దీక్ష.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

 రెవెన్యూ శివారులో సర్వే నెంబర్లు 128 లో కాస్తు చేస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని గురువారం మంగపేట రెవెన్యూ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షలను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పేదలు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఈ రోజున రిలే నిరాహార దీక్షలు ప్రారంభించవలసి వచ్చిందని పేర్కొన్నారు. 2017 లో సబ్ కలెక్టర్ గౌతమ్ కోయ భాస్కర్ రావు, కోయ బోసు బాబు పట్టాలు రద్దు చేసి సాగుచేస్తున్న పేదలకు పట్టాలివ్వాలని తీర్పు ఇచ్చిన ఐదు ఏళ్ళు పూర్తయిన ఇంతవరకు రెవెన్యూ అధికారులు సర్వే చేయలేదని, కనీసం ఎంజాయ్మెంట్ లిస్ట్ కూడా తయారు చేయలేదని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తారని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని పేర్కొని ఎక్కడ హామీలు అమలు చేయలేదని కనీసం పేదలు సాగుచేస్తున్న భూములకు వెంటనే సర్వే చేసి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు, లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షకు మంగపేట తహసీల్దార్ సలీమ్ హాజరై 120 సర్వే నెంబర్ గల భూములు సర్వే చేసి ఎంజాయ్మెంట్ వీలైనంత తొందరలో నెలరోజుల లోపు చేస్తానని హామీ ఇచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ జాగటి చిన్నా ,ఎల్ పి ముత్యాలు, మడే రవి సి ఐ టి యు మండల నాయకులు, వాసం ఎర్రయ్య ,వనుకురి కిషోర్, పి వెంకటాద్రి ,భవాని, కొమరం విజయ కుమారి, ఈర్పా రజిని, పాల్గొన్నారు ఈ దీక్షలకు మన్యసీమ రాష్ట్ర నాయకులు గొప్ప వీరయ్య మద్దతు తెలిపారు.

Share it:

TS

Post A Comment: