CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాకు నచ్చిన అప్పుడే జీతాలు ఇస్తాం..సమ్మె చేస్తారా చేసుకోండి మిషన్ భగీరథ కార్మికులకు కావేరి ఇన్ ఫ్రా కంపెనీ బెదిరింపులు...

Share it:

 





  • జీతాలు లేక అల్లాడుతున్న కార్మికులు,సమస్య పరిష్కారానికి చర్య తీసుకోవాలని సి ఐ టి యూ డిమాండ్..

మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం పర్ణశాల కేంద్రంగా నడుస్తున్న మిషన్ భగీరథ మంచినీటి పథకం నిర్వహిస్తున్న కావేరి కంపెనీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించెల్వంచకుడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది .గత ఐదు నెలల వేతన బకాయిలు చెల్లించాలని కార్మికులు యాజమాన్యాన్ని అడిగినందుకు మీ ఇష్టం అయితే చేయండి మాకు నచ్చిన అప్పుడే జీతాలు ఇస్తాం మీరేం చేస్తారో చేసుకోండి సమ్మె చేస్తారా చేసుకోండి మాకు పోయేదేం లేదు నీళ్లు రాకపోతే ప్రజలు అధికారులు నిలదీస్తారు మమ్మల్ని అడిగారు మేము మాత్రం మీకు జీతాలు మేముఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు మీరు అడిగినప్పుడు జీతాలు ఇవ్వమంటూ కంపెనీ మేనేజర్ మాట్లాడారు దీంతో కార్మికులు తమ సమస్యలు ఆరో తేదీ లోగా పరిష్కారం చేయకపోతే సమ్మె చేస్తామని ఏప్రిల్ 30వ తేదీన సంబంధిత కంపెనీ మేనేజర్ సైట్ ఇంచార్జి మిషన్ భగీరథ అధికారులు వినతి పత్రాన్ని అందజేశారు అయినప్పటికీ అధికారులు వైపునుంచి కావేరి కంపెనీ యాజమాన్యం నుంచి సరియైన స్పందన లేదు దీంతో కార్మికులు ఈరోజు అనగా 6-5- 2022న పర్ణశాల అడ్డ రోడ్డు నందు గల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కోశాధికారి పద్మ మాట్లాడారు అధికారుల అలసత్వం ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కావేరి కంపెనీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు ఐదు నెలలుగా జీతాలు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పని చేయించుకుని వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేయటం సరైన పద్ధతి కాదని సిఐటియు పేర్కొన్నది తక్షణమే చెల్లించాలని లేనియెడల ఏడో తేదీ నుంచి ఎదుట నిరవధిక సమ్మెను నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా, మిషన్ భగీరథ కార్మికులు యూనియన్ నాయకులు పవన్ ,సాయి ,చంద్ సురేష్, శ్రీను, దాసు, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: