CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని వైరా ఎమ్మెల్యేకు వినతి పత్రం..

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 18 భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వైరాలో ఆఫీస్ ఇన్ చార్జి లక్ష్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అందుబాటులో లేనందున ఎస్ఎఫ్ఐ నాయకత్వంతో ఫోన్లో మాట్లాడి తక్షణమే సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని దశలవారీ పోరాటాలు నిర్వహిస్తున్నామనీ, ఒక్క జూలూరుపాడు మండల కేంద్రంలోనే ప్రతియేటా సుమారు 400 నుండి 700 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తిచేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్నారని, సమీప మండలాలను కలుపుకొని ప్రతి యేటా 2000 మంది విద్యార్థులు 10వ తరగతి పూర్తి చేసుకొని ప్రైవేటు జూనియర్ కళాశాలలో చేరాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయనీ, రవాణా దృష్ట్యా దగ్గర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేక వందల సంఖ్యలో విద్యార్థులు చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారనీ, బలహీన వర్గాల తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటులో ఉన్నత చదువులు మరింత ఆర్ధికభారంగా భావించి 10వ తరగతి తర్వాత పై తరగతులకు వెళ్ళలేక మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారనీ, మండలంలో విద్యార్థుల సౌకర్యార్థం ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయాలని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారనీ, 

కళాశాల ఏర్పాటు గూర్చి ఎమ్మేల్యే ఇటీవల శాసన సభలో ప్రస్తావించారనీ, చట్టపరంగా కళాశాల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కళాశాల మంజూరీకి ప్రత్యేక చొరవ తీసుకొని వేలాది మంది విద్యార్థులను ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల దోపిడీ నుండి కాపాడాలనీ అలాగే మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కళాశాల, హాస్టళ్లు, సాధారణ ప్రజలు విద్యార్థుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో కళాశాల సాధనకు, స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ కొట్టే, జిల్లా సహాయ కార్యదర్శి బోడ అభిమిత్ర, మేఘన జూలూరుపాడు మండల అధ్యక్షు, కార్యదర్శులు జమ్మి యశ్వంత్, మంజుల, మండల కమిటీ సభ్యులు అఖిల్, చరణ్ తేజ, పి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: