CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలి.. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా, వామపక్ష పార్టీ నాయకులు డిమాండ్..

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్ముగూడెం మండలంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు దుమ్ముగూడెం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు పెంచిన అధిక ధరలను తగ్గించాలని నిరుద్యోగం పై నిరసన ధర్నా చేయడం జరిగిందని అనంతరం తాసిల్దార్ కార్యాలయం సంబంధిత అధికారి డిప్యూటీ తాసిల్దార్ కు పది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అనంతరం డి టి మాట్లాడుతూ మీరిచ్చిన డిమాండ్స్ అన్నిటిని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలు ఉద్దేశించి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ ఎంఎల్ ప్రజాపందా రాష్ట్ర నాయకులు కేచ్చల రంగారెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, సిపిఐ పార్టీ మండల నాయకులు తాటిపూడి రమేష్, మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై అధిక ధరలు పెంచుకుంటూ పోతుఉన్నాయి అని పెంచిన పెట్రోల్ డీజిల్ పై కేంద్రం విధించిన అన్నిరకాల సరస్సులను రద్దుచేయాలని ఎక్సైజ్ సుంకం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు తగ్గించాలని పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిత్యావసర సరుకులు బట్టలు చెప్పులు పై జిఎస్టి తగ్గించాలని స్టీల్ సిమెంట్ ఇసుక ధరలను కూడా అదుపు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలకు కు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని అలాగే దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని దరిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు నెలకు 7500 రూపాయలు ఇవ్వాలని గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని పట్టణ ప్రాంతాలలో కూడా అమలు చేయాలని వారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మరియు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు చిలకమ్మా, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సోడి రాంబాబు, మడివి ధర్మయ్య, కోర్స నాగరాజు, గట్టుపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎమ్మెల్ ప్రజాపందా నాయకులు సున్నం వీరభద్రం, మిడియం ముద్దరాజు, మర్మం మారయ్య, సిపిఐ నాయకులు నూప ధర్మయ్య, కంగాల రాముడు, కోర్స సీతరామయ్య, సరియం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: